Vayase Oka Poola Thota from Vichitra Bandham by mee snehageetham
రామకృష్ణ గారి గాత్రం మొదటి సారి మనకు వీనుల విందు గా వినిపించిన సినిమా “విచిత్ర బంధం” ఈ సినిమాలో పాడిన “వయసే ఒక పూల తోట”. ఈ గీతాని కి వాణిశ్రీ గారి ఆట, రామకృష్ణ పాటతో హుషారుగా సాగుతుంది.... మహదేవన్ గారు స్వరపరచిన ఒక హుషారైన ప్రేమ గీతం చిత్రం : విచిత్ర బంధం (1972) సంగీతం : కె.వి. మహదేవన్ సాహిత్యం : దాశరథి గానం : రామకృష్ణ, సుశీల వయసే ఒక పూలతోట.. వలపే ఒక పూలబాట ఆ తోటలో ఆ బాటలో.. పాడాలి తియ్యని పాట.. పాడాలి తియ్యని పాట వయసే ఒక పూలతోట.. వలపే ఒక పూలబాట ఆ తోటలో ఆ బాటలో.. పాడాలి తియ్యని పాట.. పాడాలి తియ్యని పాట పాల బుగ్గలు ఎరుపైతే హ.. లేత సిగ్గులు ఎదురైతే హహ.. పాల బుగ్గలు ఎరుపైతే హా.. లేత సిగ్గులు ఎదురైతే రెండు మనసులు ఒకటైతే.. పండు వెన్నెల తోడైతే రెండు మనసులు ఒకటైతే.. పండు వెన్నెల తోడైతే కోరికలే తీరేనులే.. పండాలి వలపుల పంట.. పండాలి వలపుల పంట నీ కంటి కాటుక చీకటిలో.. పగలు రేయిగ మారెనులే నీ కంటి కాటుక చీకటిలో.. పగలు రేయిగ మారెనులే నీ కొంటెనవ్వుల కాంతులలో.. రేయి పగలైపొయెనులే నీ కొంటెనవ్వుల కాంతులలో.. రేయి పగలైపొయెనులే నీ అందము నా కోసమే.. నీ మాట.. ముద్దుల మూట.. నీ మాట.. ముద్దుల మూట పొంగిపొయే పరువాలు హ. నింగినంటే కెరటాలు హహ.. పొంగిపొయే పరువాలు హా.. నింగినంటే కెరటాలు చేరుకున్నవి తీరాలు.. లేవులే ఇక దూరాలు చేరుకున్నవి తీరాలు.. లేవులే ఇక దూరాలు ఏనాటికి మన మొక్కటే ఒక మాట ఇద్దరి నోట.. ఒక మాట ఇద్దరి నోట వయసే ఒక పూలతోట.. వలపే ఒక పూలబాట.. ఆ తోటలో ఆ బాటలో పాడాలి తియ్యని పాట.. పాడాలి తియ్యని పాట
మీ
Comments
Post a Comment