Harivarasanam k.j.yesudas by mee snehageetham



అయ్యప్పస్వామి హరివరాసనం పాట ఎలా పుట్టింది ? ఎవరు రచించారు…? మొదటగా ఎవరు పాడారు..?
అయ్యప్పస్వామి హరివరాసనం పాట గాయకుడు యేసుదాసు గారు పాడిన పాట.........
అయ్యప్పస్వామికి పవళింపుగా ఈ పాటను ఆలపిస్తారు........
ఈ పాట ఎంత విన్నా తనివి తీరదు............
శబరిమల మణికంఠుని సన్నిధానంలో అయితే తన్మయత్వంలో పులకించుకోక తప్పదు. ఇంతకి ఆ పాట ఎలా పుట్టింది..? ఎవరు రచించారు…? మొదటగా ఎవరు పాడారు..?
శబరిమలలో హరివరాసనం పాడుతున్న సమయంలో ఎటువంటి వాతావరణం ఉంటుంది.?
అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడటం ఒక సాంప్రదాయం. ఇదే విధానాన్ని ఇతర అయ్యప్ప ఆలయాల్లోనూ..ఇతర పూజా కార్యక్రమాల్లో, ఉత్సవాల్లో ఆలపిస్తుంటారు. ఈ అయ్యప్ప స్వామి పవళింపు స్తోత్రాన్నికుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారు. 1955లో స్వామి విమోచనానంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారట. 1940-50 దశకాల్లో శబరిమలలోని నిర్మానుష కాలంలో వీఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు స్వామి వారి ఆలయ సమీపంలో జీవిస్తుండేవాడట. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఈ హరివరాసనాన్ని పటిస్తుండేవారట. అప్పట్లో ఈశ్వర్ నంభుత్రి అనే తాంత్రి స్వామివారికి పూజలు చేస్తుండే వారట. తర్వాత గోపాలమీనన్ శబరిమల నుంచి వెళ్లిపోయాక అతను మరణించాడని తెలుసుకుని తీవ్రంగా బాధపడి దుఃఖించిన ఈశ్వర్ నంభుద్రి తాంత్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివారట. అప్పటి నుంచి శబరిమలలో ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్థనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే
||శరణ మయ్యప్ప||
శరణకీర్తనం భక్త మానసం
భరణలోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే
ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాన్చితం
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే
||శరణ మయ్యప్ప||
తురగవాహనం సుందరాననం
వరగదాయుధం వేదవర్నితం
గురు కృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే
త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనంప్రభుం దివ్యదేశికం
త్రిదశపూజితం చిన్తితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే
||శరణ మయ్యప్ప||
భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణం
ధవలవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే
కళ మృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనం
కలభకేసరి వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే
||శరణ మయ్యప్ప||
శ్రితజనప్రియం చిన్తితప్రదం
శృతివిభూషణం సాధుజీవనం
శృతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే
||శరణ మయ్యప్ప||
మీ స్నేహగీతం 

Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham