abhimanyudu suryudu choosthunnaadu by mee snehageetham
అభిమన్యుడు చిత్రమ్ కోసం మహదేవన్ గారు స్వరపరచిన ఒక చక్కని ఆత్రేయ రచన చిత్రం : అభిమన్యుడు (1984) సంగీతం : కె.వి.మహదేవన్ రచన : ఆత్రేయ గానం : బాలు, సుశీల సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు మ్మ్..హు..నిన్ను ఎలా నమ్మను? హహహ..ఎలా నమ్మించను? ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ప్రేమకు పునాది నమ్మకము అది నదీసాగర సంగమము ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కడలికి ఎన్నో నదుల బంధము మనిషికి ఒకటే హృదయము అది వెలిగించని ప్రమిదలాంటిది వలచినప్పుడే వెలిగేది వెలిగిందా మరి?వలచావా మరి? వెలిగిందా మరి?వలచావా మరి? ఎదలొ ఏదో మెదిలింది అది ప్రేమని నేడే తెలిసింది సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు వాడు నీవాడు..నేడు రేపు ఏనాడు ఏయ్..వింటున్నావా? మ్మ్..ఏం వినమంటావ్? ఆ ఆ ఆ ఆ ఆ మనసుకు భాషే..లేదన్నారు మరి ఎవరి మాటలను..వినమంటావు? ఆ ఆఆఆ మనసు మూగగా..వినబడుతుంది అది విన్నవాళ్ళకే..బాసవుతుంది అది పలికించని వీణవంటిది మీటినప్పుడే పాటవుతుంది మీటేదెవరనీ? పాడేదేమని? మీటేదెవ్వరని? పాడేదేమని? మాటా మనసు ఒక్కటని అది మారని చెరగని సత్యమని సూర్యుడు చూస్తున్నాడు..చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మనివాడు నిజము చెబుతున్నాడు వాడు నావాడు..నేడు రేపు..మ్మ్..ఏనాడు
మీ స్నేహ గీతం
Comments
Post a Comment