Vaana Vaana Velluvaye Video Song - Gang Leader Movie by mee snehageetham
చిరంజీవి చాలా రెయిన్ సాంగ్స్ లో నటించారు కానీ వాటిలో ది బెస్ట్ అంటే ‘ గ్యాంగ్ లీడర్ ‘ (1991) లోని ఈ పాటే అని చెప్పాలి. చిరంజీవి, విజయశాంతిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ముఖ్యంగా డాన్స్ స్టెప్స్, బప్పీలహరి మ్యూజిక్, భువనచంద్ర లిరిక్స్ ఈ పాటను ఎవర్ గ్రీన్ సాంగ్ గా నిలబెట్టాయి. ప్రభుదేవా అప్పుడే కొరియోగ్రఫర్ గా ఎంటరైన సమయం అది. అతని టాలెంట్ ను చిరంజీవి బాగా ఉపయోగించుకున్నారు. ఇందులో చిరు వేసిన స్టెప్స్ చాలా రొమాంటిక్ గా, స్టైలిష్ గా అనిపిస్తాయి. ఈ పాటను ఇప్పుడు చూసినా ఒక ఫీల్ కలుగుతుంది. స్టెప్స్ లో ఎక్కడా స్పీడ్ కనబడదు. చాలా లవ్లీగా ఉంటాయి.
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
చెలియ చూపులే చిలిపి జల్లులై
మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి
చక్కని చెక్కిలి చిందే అందపు గంధం
పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం
తొలకరి చిటపట చినుకులలో మకరందం
చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ
ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల
బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా
ఏదో ఏదో ఏదో హాయి
వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే
ప్రియుని శ్వాసలే పిల్లగాలులై
మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి
మీ స్నేహ గీతం
Comments
Post a Comment