Enthavaraku Video Song gamyam movie by mee snehageetham
జీవిత పరమార్థం ఏంటో ఈ ఒక్క పాట చూస్తే తెలుస్తుంది..నాకెంతో ఇష్టమైన "గమ్యం" సినిమాలోని సిరివెన్నెల సీతారామశాస్త్రీ గారు అద్భుతంగా రచించిన super song..
ఎంతవరకు...’ అనే పాటలో ప్రతి అక్షరం మనల్ని మనకి పరిచయం చేస్తుంది. చాలా ప్రశ్నలు. చాలా జవాబులు. ఔననిపించే విషయాలు ఇందులో ఎన్నో ఉంటాయి.వేదం చెప్పే మొదటి మాట వెలుగు. ‘నీ ఉనికిని చాటే ఊపిరిలో లేదా గాలీ వెలుతురు’ అని ఆయన మనల్ని ప్రశ్నిస్తారు. పంచభూతాలు నువ్వే కదా అని చెప్పకనే చెబుతారు. పురిటి నొప్పులు తల్లివైతే పోయినప్పుడు కన్నీళ్లు చుట్టూ ఉన్నవాళ్లవి. ఈ రెండిటిలోనూ నీకు బాధ ఉండదనీ, ఆలోచించినప్పుడల్లా ‘అవును’ అనే నిజం తట్టిలేపుతూ ఉంటుంది.
‘‘సరిగా చూస్తున్నదా నీ మది
మదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలతో విడి విడి రూపాలతో
నువ్వే కాదంటున్నది’’ అనే వాక్యాలు ఆ లైన్‌ను ప్రతిబింబిస్తాయి.
వేదం చెప్పే మొదటి మాట వెలుగు. ‘నీ ఉనికిని చాటే ఊపిరిలో లేదా గాలీ వెలుతురు’ అని ఆయన మనల్ని ప్రశ్నిస్తారు. పంచభూతాలు నువ్వే కదా అని చెప్పకనే చెబుతారు. పురిటి నొప్పులు తల్లివైతే పోయినప్పుడు కన్నీళ్లు చుట్టూ ఉన్నవాళ్లవి. ఈ రెండిటిలోనూ నీకు బాధ ఉండదనీ, ఆలోచించినప్పుడల్లా ‘అవును’ అనే నిజం తట్టిలేపుతూ ఉంటుంది.
‘‘మనసులో నీవైన భావాలే
బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలోన లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
రుతువులు నీ భావ చిత్రాలే ’’
ఆయన మన ఇష్టాలను గౌరవిస్తారు. లోపాలను ఎత్తిచూపుతారు. దీన్ని కేవలం పాటగానే విని వదిలేద్దామా, లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందామా అని అనుకోకుండా ఉండలేం. మనం నవ్వినా నవ్వలేనిది... ఏడ్చినా ఏడవలేనిది నీడ మాత్రమే... అందుకే మనం చేసే ప్రతి పనికి నీడలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. జీవితం పట్ల మనిషి దృక్పథం, ఆలోచన అతనిని నిర్వచిస్తాయి. ఏ భావోద్వేగాలైనా మనం ఏమిటో ఎదుటివారికి పరిచయం చేస్తాయి.
‘‘ఎదురైన మందహాసం నీలోన చెలిమి కోసం
మోసం ద్వేషం రోషం నీ నకిలీ మదికి భాష్యం’’
మనలోని ద్వేషం, కోపం, ఆనందం ఇలా..ఎన్ని రకాల పోలికలతో చెప్పినా, మనకు మనమే కనబడతాం. నీలోని భావాలకు నువ్వే అద్దం...నీవే నిదర్శనం.
‘పుటుక చావు రెండే రెండవి
నీకవి సొంతం కావు’
అనే లైన్ వేదాంతం నుంచి పుట్టింది కాదు, నిత్యజీవితంలో మనకుండే ప్రశ్న నుంచి పుట్టింది. గమ్యం అంటే చేరడం కాదు. అదే జీవిత గమనం అనే సత్యాన్ని చాలా సరళంగా అర్థమయ్యేట్లు చెప్పారు.
‘‘జీవిత కాలం నీదే నేస్తం
రంగులు ఏం వేస్తావో కానీ’’
బ్లాక్ అండ్ వైట్ కళ్లతో ఈ రంగురంగుల ప్రపంచాన్ని చూస్తుంటాం. మనం ఏ మనిషిని చూసినా, ఏ పనిని గమనించినా మనం ఎక్కడ నిలబడి, ఏ దృక్పథంతో చూస్తున్నామనేదే ముఖ్యం. మన ఉద్దేశం..మన నిర్దేశం కూడా అదే. మన ప్రపంచం, గమ్యం కూడా అదే.
టెక్స్ట్ సపోర్ట్ బై సురేష్ రాజు సరికొండ
Comments
Post a Comment