Posts

Showing posts with the label Koluvaithiva Rangasai

Koluvaithiva Rangasai Ananda Bhairavi Movie Song by mee snehageetham

Image
సాహిత్యానికి మాళవిక, భాగవతుల వెంకట రామశర్మ చేసిన నాట్యం, గురువుగా గిరీష్ కర్నాడ్ అభినయం అద్భుతంగా మేళవించిన ఈ పాట......... కొలువైతివా... రంగశాయి ! హాయి ! కొలువైతివా... రంగశాయి !! కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి కొలువైతివా... రంగశాయి ! సిరి మదిలో పూచి తరచి రాగము రేపి చిరునవ్వు విరజాజులేవోయి ! ఏవోయి ! కొలువైతివా... రంగశాయి ! సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట పరచేటి ఎలదేటులేవోయి ఏవోయి కొలువైతివా... రంగశాయి ! ఔరా.. ఔరౌరా ! ఔరా... ఔఔరా !! రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి ముజ్జగములు మోహంబున తిలకింపగ పులకింపగ శ్రీ రంగ మందిర నవసుందరా పరా ! // శ్రీ రంగ // // శ్రీ రంగ // కొలువైతివా... రంగశాయి ! హాయి ! కొలువైతివా... రంగశాయి !! కొలువైన నిను చూడ కలవా కన్నులు వేయి కొలువైతివా... రంగశాయి !! మీ స్నేహగీతం