Pacha Bottasi Full Video Song || Baahubali మీ స్నేహగీతం
పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడా నీతో కొత్త తంటాలనే తెచ్చుకుంటాదొరా వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందరా చేయి నీచేతిలో చేరగా రెక్క విప్పిందె నా తొందర పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా మాయగా నీసోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేలా హత్తుకుపో నను ఊపిరి ఆగేలా బాహు బంధాల పొత్తిళ్ళలో విచ్చుకున్నావె ఓ మల్లికా కోడె కౌగిళ్ల పొత్తిళ్ళలో పురి విప్పింది నాకోరిక పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా.. కానల్లో నువునేను ఒకమేను కాగా కోనల్లో ప్రతికొమ్మ మురిసేనుగా మరుక్షణమే ఎదురైనా మరణం కూడా పరవశమే సాంతం నేను నీ సొంతం అయ్యానిక చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరివెన్నెల ప్రేమ ఊరేటి నీకళ్ళలో రేయి కరిగింది తెలిమంచులా పచ్చబొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడా నీతో కొత్త తంటాలనే తెచ్చుకుంటాదొరా మీ స్నేహగీతం