Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham
శ్రీరంగ రంగ నాథుని అంటూ సాగే అద్భుత గీతమిది. ఈ సాహిత్యం చూడండి... ఎంత అద్భుతంగా ఉంటుందో....
గంగా శంకాస కావేరి...
శ్రీరంగేశ మనోహరి...
కళ్యాణకారి కలుసాని...
నమస్తేసు శుభాచరి...
ఆ......
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు
కృష్ణవేణిలో అలల గీతాలు
నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
గంగను మరపించు ఈ కృష్ణవేణి
వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి
పాపాల హరియించు పావన జలము
పచ్చగ ఈ నెల పండించు ఫలము
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా
సిరిలెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా
కల్లకపటమే కానరాని ఈ పల్లెసీమలో
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీ రంగ రంగనాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
కృష్ణాతీరాన అమరావతిలో....
శిల్పకళావాణి పలికిన శృతిలో
అలలై పొంగేను జీవన గీతం
కలలే పలికించు మధుసంగీతం
చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా
వెల్లువై గుండె పల్లె పదమల్లె పల్లవై పాడగా...
శ్రీత్యాగరాజ కీర్తనై సాగే చల్లనీ జీవితం..........
మీ స్నేహ గీతం
Comments
Post a Comment