Letha Chaligalulu song from Moodu Mullu
కీ.శే .జంధ్యాల గారి దర్శకత్వo s .గోపాల రెడ్డి గారు నిర్మించిన ,1983 వచ్చిన మూడు ముళ్ళు సినిమా తమిళ్ రీమెక్ మూవీ !కధ క.భాగ్య రాజ్ గారు ! హాస్య బ్రహ్మ జంధ్యాల సుబ్రమణ్య శాస్త్రి గారి సినిమా లో కామెడీ కి కొదవేమి ఉంటుందీ ?రీమేక్ మూవీ అయినా ఎక్కడా నేటివిటీ ని మిస్ కాకుండా భాగ్య రాజ్ గారి స్టోరీ ,ముద్ర ఎక్కడా చెక్కు చేదరనివ్వ లేదు జంధ్యాల గారు !మూవీ తెలుగు లో చూస్తే తెలుగు మాత్రుక అనిపిస్తుoది!తమిళ్ లో చూస్తే తెలుగు వర్షన్ లానే ఉంటుంది !అంత జాగ్రత్త పడేవారు జంధ్యాల !రాజన్ -నాగేంద్ర సంగీత దర్శకత్వ లో వేటూరి ,ఆరుద్ర గీత రచనలు చేశారు ! చంద్ర మోహన్ ..రాధిక నటన చాలా సహజం గా అందం గా ఉంటుందీ,హీరో హీరోయిన్స్ సెంటిమెంట్ ,ప్రేమ ఎమోషనల్ సన్నివేశాలకే ప్రాముఖ్యత ని ఇస్తారు !కానీ చంద్ర మోహన్ ,రాధికలు పక్కన కామెడీ ఆర్టిస్టులతో వారికి సంభందం ఉండదుఅస్సలు వారి పక్కన ధీటుగా కామెడీ ని పండించే ధైర్యం చెయ్యాలి అంటే మామూలు ఆర్టిస్టుల వల్ల కాదు !వారికి జంధ్యాల గారు తోడైతే చెప్పేది ఏముందీ ! !నాకు ఎంతో ఇష్టమైన పాటల్లో ,ఒక పట్టాన దొరకకుండా ఏడిపించిన పాటల్లో ఒకటి మీకోసం
బాలు ..సుశీల గారి గాత్రం లొకేషన్ ..రాధికా చంద్ర మోహన్ ల అభినయం ..ఆ వాతావరణo awesome !
టెక్స్ట్ బై swetha sree
సాహిత్యం :
లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే
లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
అందాల నా కురులతో వింజామరలు వీచనా
రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా
నీ కురులవీవదలకు నా హ్రుదయమర్పించనా
రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా
కనుల భాష్పాలు కలల భాష్యాలు
వలపుగా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా
లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు దోచుకోలేవులే
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝురినై నిన్నే కోరనా
హృదయనాదాల మధురరాగాల
చిగురు సరసాల నవవసంతాల విరిలెన్నో అందించగా
లేత చలిగాలులు దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే
ఆహ హాహాహా హోయ్ హుహు
స్నేహ గీతం
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే
లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
అందాల నా కురులతో వింజామరలు వీచనా
రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా
నీ కురులవీవదలకు నా హ్రుదయమర్పించనా
రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా
కనుల భాష్పాలు కలల భాష్యాలు
వలపుగా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా
లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
లేత చలిగాలులు దోచుకోలేవులే
అధరాల కావ్యాలకు ఆవేశమందించనా
వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
మందార ముకుళాలతో పాదాలు పూజించనా
అలనై కలనై విరినై ఝురినై నిన్నే కోరనా
హృదయనాదాల మధురరాగాల
చిగురు సరసాల నవవసంతాల విరిలెన్నో అందించగా
లేత చలిగాలులు దోచుకోలేవులే
మన వలపువాకిలిని అవి తాకగలేవులే
ఆహ హాహాహా హోయ్ హుహు
స్నేహ గీతం
Comments
Post a Comment