abhimanyudu srungaara seemanthini by mee snehageetham
ఆ.. ఆ.. ఆహ.. హా.. అహా..హా..
నిసనిస.. నిసనిగ.. సగ సమా.. ఆ.. ఆ..
శృంగార సీమంతిని...
శృంగార సీమంతిని.. నా జీవన మందాకిని
నీ కనుసన్న సైయ్యాటలో.. నను జీవించనీ.. మరణించనీ
శృంగార సీమంతిని.. నా జీవన మందాకిని
నీ కనుసన్న సైయ్యాటలో.. నను జీవించనీ.. మరణించనీ
శృంగార సీమంతిని...
సరిప.. గమ గమని
సరిప.. పమ గపమ
నిసనిస.. సమగమ
నీ హృదయాన మ్రోగాలని రవళించు రాగాన్ని...
నీ గుడిలోన వెలగాలని తపియించు దీపాన్ని
నీ పాద కమలాల పారాణిని.. నీ ప్రయణ సన్నిద్ధి పూజారిని
సురలోక వాసిని.. సుమ హాసిని
చిరకాలం ఈ చెలిమి చిగురించి పూయని
శృంగార సీమంతిని.. ఆ.. నా జీవన మందాకిని..మ్మ్..
నీ కనుసన్న సైయ్యాటలో.. ఆ.. నను జీవించనీ.. మరణించనీ... ఆ..
శృంగార సీమంతిని...
పమగా.. మపగగమపగ సనిని...
మా.. మపదమపద మా గా గా
సనిని మాగగ
నీ రాయంచ గమనానికి పరిచాను పూదారిని
నువు రానున్న శుభవేళకై వేచాను ఒంటరిని
విన్నాను నీ కాలి సవ్వడిని
కన్నాను నీ కాళి కనుదోయిని
కరుణాంతరంగిని... అనురాగిని
నీ అలుకే నా పాళి వరముగా పండనీ...
శృంగార సీమంతిని.. ఆ.. నా జీవన మందాకిని..మ్మ్..
నీ కనుసన్న సైయ్యాటలో.. ఆ.. నను జీవించనీ.. హహ.. మరణించనీ... ఆ..
శృంగార సీమంతిని...
ఆ.. అ...ఆ.. ఆ..హ.. ఆ.. హా.. ఆహ. హా..
చిత్రం : అభిమన్యుడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
మీ స్నేహ గీతం
Comments
Post a Comment