Posts

Showing posts with the label ఇందు వదన కుంద రదన

Challenge Songs - Induvadana మీ స్నేహగీతం by mee snehageetham

Image
సాధారణంగా కవులు తమ కవిత్వంలో రకరకాల అలంకారాలు విరివిగా వాడుతుంటారు. కానీ ప్రతీ కవికి కొన్ని అలంకారాలంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలంకారాలు రెండు రకాలుగా విభజించ బడ్డాయి - శబ్దాలంకారం మరియు అర్దాలంకారం. శబ్దాలంకారం అంటే శబ్దానికి ప్రాధాన్యత నిచ్చే అలంకారం. ఈ అలంకారం కూర్చటంలో కవికి భావనా బలం కన్న అక్షరాల కూర్పులో నైపుణ్యం కావాలి. ప్రయోగించిన అక్షరాలనే మరల మరల ప్రయోగిస్తూనో, రెండేసి మూడేసి అక్షరాలున్న పదాలను జంటలుగా స్వీకరించో, అర్ధ భేదాన్ని ఆశిస్తూనో , తాత్పర్య భేదాన్ని కోరుకు ంటూనో ఈ శబ్దాలంకార ప్రక్రియ సాగుతోంది. ఇది ఒక క్రీడ లాంటిది. ఈ క్రీడలో మనసుకు హత్తుకునేలా అక్షరాల కూర్పు చేసుకోగల కవి మెరుస్తాడు. ఇలాంటి ఒకటి రెండు శబ్దాలంకారాల గురించి ప్రస్తావించు కుంటూ వేటూరి గారి పాటలను ఉదాహరణంగా తీసుకుందాము. వృత్యనుప్రాసాలంకారం అనగా ఒకే హల్లు అనేక సార్లు మరల మరల ప్రయోగించటం. "ఇందు వదన కుంద రదన మంద గమన మధురవచన ..." అనే పాటలో బిందుపూర్వక దకారం పలు మారులు ప్రయోగించబడినది. "జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓమైనా ఓమైనా" అనే పాటలో లకారం మరల మరల ప్రయోగించబడినది. పల్లవి : ఇందువ...