Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం
సినిమాలో కానీ నిజంగా కానీ ప్రేమికుల మనసులో భావాలను ఒకరికొకరు తెలియచేసుకునే ప్రేమలేఖ స్థానం మొదటిది, ముఖ్యమైనది కూడా ..
"నిన్ను ఎలా వర్ణించాలో తెలియదు కానీ నువ్వు నా ప్రాణమంటూ"
ప్రేమికుడు పాడే ఈ పాట సంగీత ప్రపంచంలో ప్రేమలేఖ పాటల్లో మొదటిది
బాలు గారిస్వరం మాత్రం గమనిస్తూ వినండి ప్రారంభంలో ఆ ఆలాపనా, అక్కడక్కడ అల్లరినవ్వు, ప్రేమా అని ఒక్కోసారి ఒక్కోవిధంగా పలికేతీరు అన్నీ ఖచ్చితంగా ఎంజాయ్ చేయచ్చు. మీకోసం ఈ పాట
చిత్రం : స్వప్న
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..
ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..
మెరుపనీ పిలవాలంటే..ఆ వెలుగు ఒక్క క్షణం..
పూవనీ పిలావాలంటే..ఆ సొగసు ఒక్క దినం..
ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ..
ఏ రీతిగా నిన్నూ..పిలవాలో తెలియదు నాకూ!!
తెలిసింది ఒక్కటే.. నువ్వు నా ప్రాణమనీ!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..
ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక..
తారవని అందామంటే.. నింగిలో మెరిసేవూ..
ముత్యమని అందామంటే.. నీటిలో వెలిసేవూ..
ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో??
ఎదలోన కదిలే నిన్నూ.. దేనితో సరిపోల్చాలో??
తెలిసింది ఒక్కటే..నువ్వు నా ప్రాణమని!!
ప్రేమా..ప్రేమా..ప్రేమా..
ఇదే నా మొదటి ప్రేమలేఖ..
రాసాను నీకు చెప్పలేక..
ఎదుటపడి మనసు తెలుపలేక..
తెలుపుటకు బాష చేతకాక..
తెలుపుటకు బాష చేతకాక
మీ స్నేహగీతం
మీ స్నేహగీతం
Comments
Post a Comment