Geethanjali Songs - Om Namaha మీ స్నేహగీతం
పాట మొత్తం దాదాపుగా సింగల్ షాట్ గా తీసిన మొదటి పాట గా చెప్పుకుంటారు..జాగ్రత్తగా గమనించండి పల్లవి: ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం.. ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం.. నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో...ఓ.. ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో రేగిన కోరికలతో.. గాలులు వీచగా.. జీవన వేణువులలో.. మోహన పాడగా.. దూరము లేనిదై లోకము తోచగా.. కాలము లేనిదై గగనము అందగా.. సూరేడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా.. ముద్దుల సద్దుకే నిదుర రేగే ప్రణయ గీతికి ఓం.. ఒంటరి బాటసారీ.. జంటకు చేరరా కంటికి పాపవైతే.. రెప్పగ మారనా.. తూరుపు నీవుగా.. వేకువ నేనుగా.. అల్లిక పాటగా.. పల్లవి ప్రేమగా.. ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే.. జగతికే అథిదులై జననమందిన ప్రేమ జంటకు ఓం ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఓం ఓం నమః అధర జతులకు ఓం నమః మధుర స్మృతులకు ఓం నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో...ఓ.. ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో.. ...