Poosindi Poosindi punnagaa Seetharamaiah Gari Manavaralu Song
సీతారామయ్య గారి మనవరాలు చిత్రం ఓ తెలుగుదనం నిండిన చిత్రం...తెలుగు వారి మనసులకి భావాలకు దగ్గరగా ఉన్న చిత్రం.మనసులకి మమతలకి అద్దం పట్టిన చిత్రం..అందులో పదహారు అణాల తెలుగింటి పడుచు పిల్లగా మీనా నటన తెలుగు వారి హృదయాలనుండి ఎప్పటికి తీసేవేయలేని అందమైన కావ్యం..అలాంటి చిత్రంలో మీ అందరి కోసం ఒక చక్కని పాట...
టెక్స్ట్ బై Krishna Geethika Kanumuri
పూసింది పూసింది...పున్నాగా...
పూసంత నవ్వింది...నీలాగా...
సందేళ లాగేసే...సల్లంగా ...
దాని సన్నాయి... జళ్లోన సంపెంగ...
ముల్లోకాలే కుప్పెలై...జడ కుప్పెలై
ఆడ...జతులాడా......(పూసింది)
పూసంత నవ్వింది...నీలాగా...
సందేళ లాగేసే...సల్లంగా ...
దాని సన్నాయి... జళ్లోన సంపెంగ...
ముల్లోకాలే కుప్పెలై...జడ కుప్పెలై
ఆడ...జతులాడా......(పూసింది)
ఇష్ట సఖి నా చిలుకా...నీ పలుకే బంగారంగా
అష్టపదులై పలికే...నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో..కలలొచ్చాయి లే
కాలలొచ్చేటి నీ కంటి పాపాయిలే..కథ చెప్పాయిలే
అనుకోని రాగమే... అనురాగ దీపమై
వలపన్న గానమే... ఒక వాయు లీనమై
పాడే... మది పాడే.......(పూసింది)
అష్టపదులై పలికే...నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో..కలలొచ్చాయి లే
కాలలొచ్చేటి నీ కంటి పాపాయిలే..కథ చెప్పాయిలే
అనుకోని రాగమే... అనురాగ దీపమై
వలపన్న గానమే... ఒక వాయు లీనమై
పాడే... మది పాడే.......(పూసింది)
పట్టుకొంది నీ పదమే... నా పదమే పారాణిగా
కట్టుకొంది నీ కవితే... నీ కలలే కల్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే..స్వరమిచ్చావులే
ఇరు తీరాల గోదారి గంగమ్మకే... అలలిచ్చావులే
అల ఎంకి పాటలే...ఇల పూల తోటలై
పసి మొగ్గ రేకులే... పరువాల చూపులై
పూసే...విరబూసే......(పూసింది)
కట్టుకొంది నీ కవితే... నీ కలలే కల్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే..స్వరమిచ్చావులే
ఇరు తీరాల గోదారి గంగమ్మకే... అలలిచ్చావులే
అల ఎంకి పాటలే...ఇల పూల తోటలై
పసి మొగ్గ రేకులే... పరువాల చూపులై
పూసే...విరబూసే......(పూసింది)
Comments
Post a Comment