Neevu Leni Nenu Lenu Video Song | Manchi Manushulu by mee snehageetham
శోభన్‌బాబుగారి కెరీర్‌లోనే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సాంఘిక చిత్రం ఇదే. అలాగే ఆయన నటజీవితంలో అత్యుత్తమ సంగీతభరిత చిత్రంగా ‘మంచిమనుషులు’ ప్రశంసలందుకొంది.
జీవన్‌ప్రభ దేశాయ్ రాసిన ఒక హిందీ కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘ఆ గలే లగ్ జా’(1973) చిత్రం ఆధారంగా ‘మంచిమనుషులు’ చిత్రం తయారైంది. శశికపూర్, షర్మిలాఠాగూర్ హిందీలో పోషించిన పాత్రలను తెలుగులో శోభన్‌బాబు, మంజుల నటించారు
‘పడకు పడకు వెంట పడకు’, ‘నీవు లేని నేను లేను.. నేను లేక నీవు లేవు’, ‘విను నా మాట విన్నావంటే’, ‘నిన్ను మరచి పోవాలని అన్ని విడిచి వెళ్లాలని’, ‘పెళ్లయ్యింది ప్రేమ విందుకు వేళయింది’... ఇలా సినిమాలో ప్రతి పాటా హిట్టే. ఆత్రేయ, ఆరుద్ర రాసిన పాటలకు మామ మహదేవన్ మధురమైన బాణీలు సమకూర్చారు. అలాగే ప్రేక్షకుల్ని కలల తీరంలోకి తీసుకువెళ్లేలా దర్శకుడు రాజేంద్రప్రసాద్ ఈ పాటల్ని చిత్రీకరించారు.
చిత్రం : మంచి మనుషులు (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆహ..ఆహ..ఆహా..ఆహ...ఆ..ఆ..
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు.. నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో..
ఈ జగమే లేదు..
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు.. నువ్వే నేను
నువ్వూ నేను నేను నువ్వు లేనిచో..
ఈ జగమే లేదు..
తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ
పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ..
తీగల్లో నువ్వూ నేనే..అల్లుకునేదీ..ఈ
పువ్వుల్లో నువ్వు నేనే..మురిసివిరిసేదీ..
తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ..
తెమ్మెరిలో మనమిద్దరమే పరిమళించేదీ...
తేనెకు మన ముద్దేలే తీపినిచ్చేదీ..తీపినిచ్చేదీ..
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు..నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో..
ఈ జగమే లేదు..
నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ..ఈ
నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ..
సృష్టిలోని అణువు అణువులో..
వున్నామిద్దరమూ..ఊ..ఊ
జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ ....
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు
నేనే నువ్వు..నువ్వే నేను
నేను నువ్వూ నువ్వూ నేను లేనిచో..
ఈ జగమే లేదు..
కొండల్లే నువ్వున్నావు.. నాకు అండగా..ఆ..
మంచల్లే నువ్వున్నావూ.. నాకు నిండుగా..ఆ..ఆ..
కొండల్లే నువ్వున్నావు.. నాకు అండగా..ఆ..
మంచల్లే నువ్వున్నావూ.. నాకు నిండుగా..ఆ..ఆ..
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా..
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా..
నిన్నా..నేడు రేపే లేని..ప్రేమ జంటగా..ఆ..ఆ
ప్రేమ జంటగా..ఆ...
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు..
నీవు లేని నేను లేను..
నేను లేక నీవు లేవు...
నేనే నువ్వు..నువ్వే నేను
నేను నువ్వు నువ్వు నేను లేనిచో..
ఈ జగమే లేదు..
అహ..అహ..హహా..హా.హా
మీ స్నేహగీతం
Comments
Post a Comment