Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం
సూర్యుడిని వివిధ సమయాలలో ఏ ఛాయ లో చూడగలమో అచ్చ తెలుగు భాషలో, అచ్చ తెలుగు పూల రంగులతో పోల్చి గానం చేసిన తీరు చాలా అందంగా వివరించారు
"పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."అంటూ పొద్దు పొడుస్తున్న సూర్యబింబాన్ని వర్ణించటం మధురానుభూతినిస్తుంది.
అలాగే "మధ్యాన్న భానుడు మల్లె పూ ఛాయా, మల్లెపూవు మీద మైనంపు పొడి ఛాయ" అని, "అస్తమాన భానుడు వంగ పూ చ్చాయ వంగ పూవు మీద వజ్రంపు పొడి ఛాయ ... ""పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."నిజం గా ఏదో లోకాలలో విహరింప చేస్తుంది.
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
"పొడుస్తూ భానుడు పొన్న పూవు ఛాయా
పొన్న పూవు మీద పొగడ పూ పొడి ఛాయా. . ."
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
ఉదయిస్తూ భానుడు ఉల్లి పూవు ఛాయా
వుల్లిపూవు మిద ఉగ్రంపు పొడి ఛాయా
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
ఘడిఎక్కి భానుడు కంబపూవు ఛాయా
కంభపూవు మిద కాకరి ఫూచాయ
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
ఝామెక్కి భానుడు జాజిపూవు ఛాయా
ఝామెక్కి భానుడు సంపంగి పూచాయమద్యహ్న
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
మధ్యాహ్న భానుడు మల్లె పూవు ఛాయా
మల్లె పూవు మిద మంకెన్న పూచాయ
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
మూడు ఝాముల భానుడు ములగ పూవు ఛాయా
ములగ పూవు మిద ముత్యంపు ఛాయా
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
అస్తమాన భానుడు ఆవపూవు ఛాయా
ఆవపూవు మిద అద్దంపు పొడి ఛాయా
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
వాలుతూ భానుడు వంగపూవు ఛాయా
వంగ పూవు మిద వజ్రపు పొడి ఛాయా
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
గుంకుతూ భానుడు గుమ్మడి పూఛాయా
గుమ్మడి పూవుమిదా కుంకుంపూ ఛాయా
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ మేలుకో
మీ స్నేహగీతం
Comments
Post a Comment