Baanam - Naalo Nenena Video by mee snehageetham
నేనేనా.........?ఏదో అన్నానా....?నువ్వు విన్నావా........?
ఇంతకీ ఏం విన్నావ్" అంటూ తనతో తనులేని కథానాయకుని మైమరుపుని స్పష్టంగా చెప్తూ పల్లవి మొదలెట్టించేస్తారు. ....
మొదటి చరణం లో కథానాయకుడు ..........."తడబాటునీ.. అంతో ఇంతో గడి దాటనీ..
విడి విడి పోనీ పరదానీ.. పలుకై రానీ ప్రాణాన్నీ..
ఎదంతా పదాల్లోన పలికేనా..
నా మౌనమే ప్రేమ ఆలాపన..
మనసే..నాదీ.... మాటే..నీదీ..
ఇదేం.. మాయో.."అని చెప్తుంటే,
కథానాయికతో "మన పిచ్చిగానీ అసలు ఎదలో ఉన్నదంతా పదాల్లో పలుకుతుందా ......?
నా మౌనమే ప్రేమాలాపన.. నామనసున ఉన్నది నీ మాటల్లో బయటకు వస్తుంటే ఇక మన మధ్య మాటలెందుకు ?
అనిపించి, వారిద్దరి మధ్య ఉన్న అనుభంధాన్ని మనకి స్పష్టంగా అర్ధమయ్యేలా చెప్పేస్తారు.
ఇక రెండోవ చరణం లో కథానాయిక " అని కథానాయకునితో "దైవం వరమై దొరికిందనీ.. నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్నీ.. చిగురై పోనీ శిశిరాన్నీ..
నీతో చెలిమి చెస్తున్న నిమిషాలూ..
నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా..
మనమే సాక్ష్యం... మాటే మంత్రం
ప్రేమే.. బంధం"
అనిపించి ఆ అనుభంధాన్ని మరింత దృఢంగా చూపించేస్తారు.
చిత్రం : బాణం
సహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణి శర్మ
గానం : హేమచంద్ర , సైంధవి
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
విన్న మాటేదో నిన్నడగనా ||నాలో నేనేనా||
అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాదీ.. మాటే నీదీ..
ఇదేం.. మాయో...
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..
ఔనూ కాదు తడబాటునీ.. అంతో ఇంతో గడి దాటనీ..
విడి విడి పోనీ పరదానీ.. పలుకై రానీ ప్రాణాన్నీ..
ఎదంతా పదాల్లోన పలికేనా..
నా మౌనమే ప్రేమ ఆలాపన..
మనసే..నాదీ.... మాటే..నీదీ..
ఇదేం.. మాయో..
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..
దైవం వరమై దొరికిందనీ.. నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్నీ.. చిగురై పోనీ శిశిరాన్నీ..
నీతో చెలిమి చెస్తున్న నిమిషాలూ..
నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా..
మనమే సాక్ష్యం... మాటే మంత్రం
ప్రేమే.. బంధం..
నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..
మీ
Comments
Post a Comment