Shiva Poojaku Song - Swarna Kamalam Movie Song by mee snehageetham



శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా..
“చివురించిన మువ్వ” ???????
మువ్వ అంటే పువ్వు కాదు కదా! మరి మువ్వని పువ్వు అని సమర్థించడం ఎలా అంటే అడుగడుగునా మువ్వకి సర్వలక్షణాల్లోనూ పువ్వుతో సారూప్యం కనిపిస్తుంది. పువ్వు చిగురిస్తుంది – ఒక లతకి, ఒక కొమ్మకి. మరి మువ్వ మృదువైన, అందమైన (మంజుల) పాదాలు అనే లతకి (మంజరి) చిగురించిన పువ్వు. పువ్వుకి పరిమళం ఉంటుంది. మరి మువ్వకి జతిస్వరములు. అయితే ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేని రెండు వస్తువుల్ని అంత బలవంతంగా, విచిత్రంగా ఎందుకు పోల్చాలి? ఎందుకూ అంటే నాదమూర్తి, నటరాజు అయిన పరమేశ్వరుడి పాదపూజకి మామూలు పూలు కాకుండా, నాట్యానికి సంబంధించిన పూలు అయితే ధర్మంగా ఉంటుంది. కనుక “శివపూజకి చివురించిన సిరిసిరి మువ్వా”. అదే విధంగా వాసన, జతిస్వరాలు ఒకటి కాదు. కనుకనే యతిరాజు అని వాడడం జరిగింది. యతిరాజు అంటే సన్యాసులకి రాజు అని. సర్వసంగ పరిత్యాగి అయిన యోగి, సుగంధ ద్రవ్యాల్ని, సువాసనల్ని స్వీకరిస్తాడా? కానీ శివుడే ఒక విచిత్రమైన యోగి. ఇద్దరు భార్యలున్న సన్యాసి. అర్ధనారీశ్వరుడైన విరాగి. అతడు సంసారి కనుక పరిమళాలు కావాలి. సన్యాసి కనుక పరిమళాలు కూడదు. ఈ రెండూ కలిసొచ్చి “యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా”!
భళా సిరివెన్నెల గారు భళా
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
నటనాంజలితో బ్రతుకును తరీంచనీవా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
పడమర పడగలపై .. మెరిసే తారలకై
పడమర పడగలపై .. మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరీ
తూరుపు వేదికపై .. వేకువ నర్తకివై
తూరుపు వేదికపై .. వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ
శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరిసిరిమువ్వా .. సిరిసిరిమువ్వా
తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోదు ఎక్కడా
అవధిలేని అందముంది అవనికి నలు దిక్కులా
ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
జలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం
గగన సరసి హృదయంలో ..
వికసిత శతదళ శోభల సువర్ణ కమలం
పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
సేకరణ:స్నేహగీతం

Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham