swararaga ganga pravahame Video Song మీ స్నేహగీతం
మౌనాక్షరీ గానం అంటే ? మౌనం అంటున్నారు ఒక పక్క , గానం అంటున్నారు ఒక పక్క .రెండిటికీ పొంతనే లేదే ?
గానం ఎప్పుడూ వినిపించదు. కొన్ని గానాలు ఊహాగానాలు అంటాం మనం. అవి వినిపిస్తాయా? వినిపించవు. అట్లాగే ఈ మౌనాక్షరీ గానం. అక్కడ అక్షరాలు ఉండవు ఏదో ఉంటుంది. అక్షరానికి, అక్షరానికి మధ్య శూన్యం అనగా ఆకాశం అందులో ఏదో ఉంటుంది. అందులో సూర్యుడు ఉండొచ్చు, చంద్రుడు ఉండొచ్చు,తారలుండొచ్చు. అది ఏమైనా ఉండొచ్చు. అది ఉరమవచ్చు. మెరవనూ వచ్చు. అసలు గానం అంటే ఏమిటి? నాదం అంటే ఏమిటి? నాదం పుడుతుంది. అది మీలో మీకు మాత్రమే పరిమితం. తద్వారా దాని బాహ్యమైన ఎక్స్‌ప్రెషన్ మాత్రం గానం. అనంతమైన రాగాల రూపంలో ప్రస్తరించి బయటకు వచ్చేదే గానం. ధ్వని వేరు. శబ్దం వేరు. గానం వేరు
స్వర రాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
ప్రాప్తే వసంతే త్రికాలికే
పలికే కుహు గీతికా
గాన సరసీరుహమాలికా !! స్వర రాగ !!
గమపని గమపని గమపని గమపని
మపనిస మపనిస మపనిస మపనిస
పనిసగ సగసని సనిపమ పమగమ గ
కొండల లోపల నిండిన నింగిలో
ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లన గ్రోవిలో పిలవని మోవిలో
కురిసెను రాగం ఈనాటికి
మట్టింటి రాయే మాణిక్యమైపోయె
సంగీత రత్నాకరానా
స్వర సప్తకాలే కెరటాలు కాగా
ఆ గంగ పొంగింది లోన !! స్వర రాగ !!
సని సని సగగస గసగస పమపమ
మగమగ పమపమ నిసనిప సనిసని
చైతన్య వర్ణాల ఈ చైత్ర సుమవీధి
వినిపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చక్కోరాలు
జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు
పులకింతలా పుష్యరాగాలులే
మలిసందె దీపాలు గుడిగంట నాదాలు
మౌనాక్షరీ గాన వేదాలులే !! స్వర రాగ !!
జ్యోతి వలబోజు గారు మరియు వేటూరి గారి సౌజన్యంతో
మీ స్నేహగీతం
Comments
Post a Comment