Murari Movie || Alanati Full Video Song మీ స్నేహగీతం


అలనాటి రామ చంద్రుడి కన్నింట సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్న అన్నటి మేటి
అలనాటి రామ చంద్రుడి కన్నింట సాటి
ఆ పలనాటి బాల చంద్రుడి కన్న అన్నటి మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి.
తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన
శ్రీహరింటి దీపమల్లే కనిపించిన జాన
తెలుగింటి పాలసంద్రము కనిపించిన కూన
శ్రీహరింటి దీపమల్లే కనిపించిన జాన
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి
చందమామ చందమామ కిందకు చూడమ్మా
ఈ నేలమీద నెలరాజుని చూసి నీవ్వెరపోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెల బోవమ్మ
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు
నెలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందుల చేసే సమయాన
అందాల జంట అందరి కంటికి విందుల చేసే సమయాన
కలకలకు దొరకని కల గల జంటని పది మంది చూడండి
తల తల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలు వేయండి.
చందమామ చందమామ కిందకు చుడమ్మా
ఈ నేలమీద నెలరాజుని చూసి నివ్వెరపోవమ్మా
వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా
మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెల బోవమ్మ
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన
గౌరిశంకరు లేకమైన సుమూహూర్తమల్లె ఉన్నా
మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన
దేవుళ్ళ పెళ్లి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
దేవుళ్ళ పెళ్లి వేడుకలైన ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములు అడుగక బంధువులంతా కదలండి
మీ స్నేహగీతం 

Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham