Intinti Ramayanam Movie Songs - Veena Venuvaina Song ,మీ స్నేహగీతం
వీణ వేణువైన సరిగమ విన్నావా.....
ప్రేమ పాట కాబట్టి ప్రేమ, మనసు, అనురాగం, దాంపత్యం, హృదయం, మమత, ప్రాణం ఇలాంటి పదాల్లో ఏదో ఒక్కటైనా వినబడాలి కదా కాని,పాటను పల్లవి ఆరంభం ముందు వరకూ వినండి. పాట ఆరంభంలో వీణ! ఆ వీణ అలా మెలమెల్లగా వచ్చి మురళీనాదంతో లీనమవడం – అంటే వీణ వేణువైన సరిగమ, తీగ రాగమైన మధురిమ ను గమనించారా?
ఈ పాటలో జానకి “తహ తహ” లాడాల అన్నప్పుడు పరవశమూ, బాలూ “అహాహా లలలా” అని రాగం తీసినప్పుడు ఉన్న అలవోక, ఒక అద్భుతం.
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ…. తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో…
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ…. తీగ రాగమైన మధురిమ కన్నావా
ఊపిరి తగిలిన వేళా.. నే వంపులు తిరిగిన వేళా
నా వీణలో నీ వేణువే పలికే రాగమాలా
ఆ…ఆ.. లాలలా… ఆ…
చూపులు రగిలిన వేళా ఆ చుక్కలు వెలిగిన వేళా
నా తనువునా అణువణువునా జరిగే రాసలీలా ..
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ…. తీగ రాగమైన మధురిమ కన్నావా
ఎదలో అందం ఎదుటా.. ఎదుటే వలచిన వనితా
నీ రాకతో నా తోటలో.. వెలసే వనదేవతా
ఆ… ఆ.. లాలలా… ఆ…
కదిలే అందం కవితా.. అది కౌగిలికొస్తే యువతా
నా పాటలో నీ పల్లవే.. నవతా నవ్య మమతా
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ…. తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో…
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ…. తీగ రాగమైన మధురిమ కన్నావా
మీ స్నేహగీతం
Comments
Post a Comment