Mounamelanoyi sagarasangamam
మన జీవితకాలం లో కొన్ని వేల పాటలు విన్నాం,వింటున్నాం కదా!!!
ఈ రోజుకీ వింటుంటే ఇన్ని పాటల మధ్యమనసుని గాలి అలలపైన తేల్చేసి,
హృదయాన్ని పూరెక్కల మధ్య ముంచేసి,
ఆలోచనలన్నీ మాయం చేసి, బాధలన్నీ మటుమాయం చేసి,
మనల్ని మరో ప్రపంచంలో గిరికీలు కొట్టించే
పాటలెన్ని ఉంటాయి?
వేళ్ళ పైన లెక్క పెట్టేటన్ని మాత్రమే కదా?
ఈ పాట మాత్రం ఎన్ని సార్లు విన్నా నేను ఇంకా ఆ గోరు వెచ్చటి నీటి అనుభూతి, ఆ చల్లని సముద్రపు గాలి హాయి ,ఆ గులాబీ పూవు సువాసన ,ఆ సాంబ్రాణి పొగ అలౌకిక ఆఘ్రాణం పొందగలను..
మౌనమేలనోయి...
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల వెలిగే కన్నుల
తారాడే హాయిలో..
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
పలికే పెదవి వొణికింది ఎందుకో?
వొణికే పెదవి వెనకాల ఏమిటో?
కలిసే మనసులా.. విరిసే వయసులా
కలిసే మనసులా.. విరిసే వయసులా
నీలి నీలి ఊసులు లేతగాలి బాసలు..
ఏమేమో అడిగినా
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
హిమమే కురిసే చందమామ కౌగిట
సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగుల వలపూమడుగుల
ఇవి ఏడడుగుల వలపూమడుగుల
కన్నె ఈడు ఉలుకులు కంటిపాప కబురులు...
ఎంతెంతొ తెలిసిన
మౌనమేలనోయి.. ఈ మరపు రాని రేయి
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల ఆఆఆఅ వెలిగే కన్నుల
ఎదలో వెన్నెల ఆఆఆఅ వెలిగే కన్నుల
తారాడే హాయిలో..
ఇంత మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
మీ Mee Snehageetham
Comments
Post a Comment