Mate Rani Chinnadani O Paapa Laali song మీ స్నేహగీతం
ఇళయరాజా గారు స్వరపరచిన ఓ పాపా లాలి చిత్రంలోని ఓ చక్కటి పాట ఇది. బాలు గారి గాన మాధుర్యానికి మాత్రమే కాకుండా వారి అసమాన ప్రతిభకు తార్కాణం ఈ పాట.. చరణాలు ఆపకుండా పాడటం ఈ పాట ప్రత్యేకత.
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
వెన్నెలల్లే పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసే చూపులు కలిసెను
చందమామ పట్టపగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లు లోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలు కొలుపే నా చెలి పిలుపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే !!
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
మీ స్నేహగీతం
Comments
Post a Comment