eenade edo ayyindi ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది,మీ స్నేహగీతం
వాతాపి గణపతిం భజే… అన్న కృతి వినని తెలుగు వాడుండడు. ఈ కృతి కోసం పుట్టినదే హంసధ్వని రాగం అనిపిస్తుంది .
హంసధ్వని వల్ల వాతాపిగణపతిం కీర్తనకి పేరు వచ్చిందా లేక వాతాపి గణపతిం కీర్తన వల్ల హంసధ్వని అందం పెరిగిందా అనేది చెప్పటం కష్టం. ఇటువంటి అన్యోన్యత మరే ఇతర రాగాలకు ఏ కృతి తోనూ లేదు.ఈ హంసధ్వని రాగాన్ని సృష్టించినది ముత్తుస్వామి దీక్షితార్ గారి తండ్రి గారైన రామస్వామి దీక్షితార్ గారు. మరి అందుకేనేమో ముత్తుస్వామి దీక్షితార్ గారు ఇంత అందమైన కృతిని కూర్చారు ఈ రాగంలో. ఏ కొడుకు మాత్రం ఇంతకన్న విలువైన బహుమతి ఇవ్వగలడు తండ్రికనిపిస్తుంది .
తెలుగు సినిమా సంగీత దర్శకులలో హంసధ్వనిని నాకు తెలిసి ఎంతో ప్రీతితో వాడినది ఇళయరాజా. రుద్రవీణ సినిమాలో తరలి రాద తనే వసంతం అన్న పాట ఒక అద్భుతమైన కంపోజిషన్. హంసధ్వని ఆధారంగా స్వరపరచిన ఈ పాట మాధుర్యంలో వసంత కోకిల గానాన్ని తలపిస్తుంది.
ప్రేమ చిత్రంలో ఇళయరాజా స్వరపరచిన ఈనాడే ఏదో అయ్యింది అన్న పాట కూడా హంసధ్వని ఆధారంగా చేసినదే. హంసధ్వని రాగాన్ని వాడి వాతాపిగణపతిం కీర్తన ఛాయలనుండి తప్పించుకోవడం ఇళయరాజాకే చెల్లింది.
ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది
ఈ అనుభవం మరలా రానిది
ఆనంద రాగం మోగింది
అందాల లోకం రమ్మంది
ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగంది
నింగి నేల ఏకం కాగా ఈ క్షణమిలాగే ఆగింది(2)
ఒకటే మాటన్నది ఒకటై పొమ్మన్నది
మనసే ఇమ్మన్నది అది నా సొమ్మన్నది
పరువాలు మీటి సెలయేటి తోటి
పాడాలి నేడు కావాలి తోడు
సూర్యుని మాపి చంద్రునినాపి
వెన్నెల రోజంత కాచింది
పగలు రేయన్నది అసలే లేదన్నది
కలలే వద్దన్నది నిజమే కమ్మన్నది
ఎదలోని ఆశ ఎదగాలి బాస
కలవాలి నీవు కరగాలి నేను
మీ స్నేహ గీతం.
Comments
Post a Comment