Julayi : Oh Madhu Oh Madhu మీ స్నేహగీతం
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాది కాదు
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాలో లేదు
రంగులరాట్నంలా కళ్లను తిప్పి చేశావే జాదూ
అందాల అయస్కాంతంలా తిప్పావే హైదరబాదూ
నన్నొదిలి నీవైపొచ్చిన మనసెట్టాగో తిరిగిక రాదు
వచ్చినా ఏం చేసుకుంటా నీతో ఉంచేయ్ నాకొద్దు
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాది కాదు
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాలో లేదు
వాన పడుతుంటే...
ప్రతి చిన్న చినుకు అద్దంలాగ నిను చూపిస్తుందే
మా నాన్న తిడుతుంటే...
ప్రతి పెద్ద అరుపు నీ పేరల్లే వినిపిస్తూ ఉందే
రెండు జళ్లు వేసుకున్న చిన్నపిల్లలాగ
యవ్వనాలు పూసుకున్న వాన విల్లులాగ
ఒక్కొక్క యాంగిల్‌లో ఒక్కొక్కలాగ
కవ్వించి చంపావే కరెంట్ తీగ
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాది కాదు
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాలో లేదు... ఓ మధు...
సన్నాయిలా ఉందే అమ్మాయిలందరిని
ఉడికించే నున్నని నీ నడుము
సంజాయిషీ ఇస్తూ ఆ బ్రహ్మ దిగిన
చేసిన తప్పును క్షమించనే లేము
చందనాలు చల్లుకున్న చందమామలాగా
మత్తుమందు జల్లుతున్న మల్లెముగ్గ దాకా
ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగ
ఊరించి చంపావే నన్నే ఇలాగ
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాది కాదు
ఓ మధు... ఓ మధు...
నా మనసు నాలో లేదు
మధు... మధు...మధు...
ఓ మధు... ఓ మధు...ఓ మధు...
మీ స్నేహగీతం
Comments
Post a Comment