Seetharamula Kalyanam Chothamu Rarandi Song మీ స్నేహగీతం
సీతా రాముల కళ్యాణము చూతము రారండి..
శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి..
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి... బొట్టును పెట్టి,
మణి భాసికమును నుదుటను గట్టి...నుదుటను గట్టి,
పారాణిని పాదాలకు పెట్టి ఆ....
పారాణిని పాదాలకు పెట్టి, పెళ్లి కూతురై వెలసిన సీతా
కళ్యాణము చూతము రారండి..శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి..

సంపగి నూనెను కురులను దువ్వి..కురులను దువ్వి,
సొంపుగ కస్తూరి నామము దీర్చి.. నామము దీర్చి,
చెంపగా వాసి చుక్కను బెట్టి ఆ....
చెంపగా వాసి చుక్కను బెట్టి, పెళ్లి కొడుకై వెలసిన రాముని
కళ్యాణము చూతము రారండి..శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి..
సొంపుగ కస్తూరి నామము దీర్చి.. నామము దీర్చి,
చెంపగా వాసి చుక్కను బెట్టి ఆ....
చెంపగా వాసి చుక్కను బెట్టి, పెళ్లి కొడుకై వెలసిన రాముని
కళ్యాణము చూతము రారండి..శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి..
జానకి దోసిట కెంపుల ప్రోవై... కెంపుల ప్రోవై,
రాముని దోసిట నీలపు రాసై... నీలపు రాసై,
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ.....
ఆణిముత్యములు తలంబ్రాలుగా...శిరముల మెరసిన సీతారాముల
కళ్యాణము చూతము రారండి..శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి..
రాముని దోసిట నీలపు రాసై... నీలపు రాసై,
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ.....
ఆణిముత్యములు తలంబ్రాలుగా...శిరముల మెరసిన సీతారాముల
కళ్యాణము చూతము రారండి..శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి..
సీతారాముల కళ్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి
చూచు వారలకు చూడ ముచ్చటట, పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట....
భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట ఆ.......భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట...
పురలను మునులను చూడ వత్తురట..... కళ్యాణము చూతము రారండి..
దుర్జన కోటిని దర్ప మటంచగ......సజ్జన కోటిని సంరక్షింపగ...
ధారుణి శాంతిని స్థాపన చేయగ... ధారుణి శాంతిని స్థాపన చేయగ...
నరుడై పుట్టిన పురుషోత్తముని... కళ్యాణము చూతము రారండి..
దశరథ రాజు సుతుడై వెలసి....కౌశికు యాగము రక్షణ చేసి...
జనకుని సభలో హరి విల్లు విరిచి ఆ...

జనకుని సభలో హరి విల్లు విరిచి...జానకి మనసు గెలచిన రాముని
కళ్యాణము చూతము రారండి..శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి..
కళ్యాణము చూతము రారండి..శ్రీ సీతా రాముల కళ్యాణము చూతము రారండి..
మీ స్నేహగీతం
Comments
Post a Comment