Saptapadi Movie Govullu Tellana Video Song,by mee snehageetham మీ స్నేహగీతం
'' సప్తపది'' చిత్రం లో 'గోవుల్లు తెల్లన' పాటలో 'తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా ... కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా' అని రాశారు వేటూరి గారు ,
కదుపు' అంటే సమూహం. 'కడుపు' అంటే అందరికీ తెలిసినదే. తెల్లటి ఆవులున్న మందలో నల్లటి ఆవులుండవా , నల్లటి ఆవు కడుపున ఎర్రటి ఆవు పుట్టదా అన్నది దాని అర్ధం. ఆ సినిమా వర్ణ వివక్షతకు సంబంధించిన చిత్రం కాబట్టి వేటూరి ఆ వాక్యాలను అంత నర్మగర్భంగా వాడేరు. ఇది తెలుసుకుని పాడేవాళ్ళు ఎంతమంది ?
అర్ధం తెలుసుకొని పాడే వారి పట్ల సంగీత దర్శకులు చూపించే గౌరవం ఎంతో గొప్పగా వుంటుంది. ఇవేవీ పట్టించుకోకుండా 'తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా ... కర్రావు కడుపునా ఎర్రావు పుట్టదా' అని పాడేస్తున్నారు చాలా మంది.
'కదుపు - కడుపు' అనే పదాల్లోని శబ్ద సారూప్యాన్ని తెలివిగా వాడుకోగలగటం వేటూరి చమత్కారం.
ఇలాంటివి తెలుసుకోవాలి కదా ?
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన
తెల్లావు కదుపుల్లో కర్రావులుండవా
ఎందుకుండవ్
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
ఏమో
తెల్లావు కదుపుల్లో కర్రావు లుండవా
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్న గోపెమ్మ ఈడున్న
గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా
ఆ పొద్దు పొడిచేనా
ఈ పొద్దు గడిచేనా
ఎందువలన అంటే అందువలన
ఎందువలన అంటే దైవఘటన
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
పాపం
అల్లనమోవికి తాకితే గేయాలు
ఆ ఆ ఆ ఆ
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు
అల్లనమోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా
ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా
ఈ కడిమి పూసేనా
ఆ కలిమి చూసేనా
మీ స్నేహగీతం
సేకరణ
Comments
Post a Comment