Kannanule Video Song - Bombay Movie by mee snehageetham మీ స్నేహగీతం
ఇది నిజమా కల నిజమా, గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా
పాట ఆఖరి లైన్లు చూడండి.. తరచి చూస్తే ఇదంతా కలా నిజమా అని ఆ అమ్మాయికి అనిపిస్తోంది. లేకపోతే తానేమిటి ఇలా అయిపోవడం ఏమిటి? ఈ ప్రేమని జయించి తీరకపోతే బ్రతుకు వృథా అనిపించేంత మాయ ఎలా జరిగింది? స్పృహలో ఉన్నామా కలలో ఉన్నామా తేల్చుకోడానికి చేతిని గిల్లి చూసుకుంటాం. అయితే ఆ అమ్మాయి తన బ్రతుకుని గిల్లి అడిగిందట! “గిల్లుకున్న జన్మనడిగా” – ఎంత అద్భుతమైన ప్రయోగం! ఇంకా ఈ తీయని ఊహల మైమరపులో భాషనే మరిచిపోయిందిట! ఈ భావాన్ని కూడా ఎంత అద్భుతంగా చెప్పాడండి – “నీ నమాజుల్లో ఓనమాలు మరిచా”. “నమాజు” అనడం ద్వారా అమ్మాయి ముస్లిం అన్న విషయం గుర్తు చేస్తూ, తనది కేవలం తీయని ఊహ కాదు, ఓ ఆరాధన, ఓ ప్రార్థన అని తెలియజేస్తున్నాడు! ఓనమాలు – అంటే అక్షరాలు అనే కాదు, “ఓం నమః” ని గుర్తుచెయ్యడం ద్వారా అబ్బాయి హైందత్వాన్ని కూడా స్ఫురింపజెయ్యడం. అంటే ఈ మతాల వైషమ్యాలు మరిచి, ఈ అడ్డుగోడలు దాటి ప్రేమని సాధించుకుందాం అని చెప్పడం! ఈ రెండు వాక్యాలకీ వేటూరిగారికి నమస్కరించ వచ్చు అనిపిస్తుంది
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే
అందాల వయసేదొ తెలితామరై, విరబూసె వలపేదో నాలో
నీ పేరు నా పేరు తెలుసా మరీ, హృదయాల కథ మారె నీలో
వలపందుకే కలిపేనులే, ఒడిచేరె వయసెన్నడో
ఉరికే కసివయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం
జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం
అందం తొలికెరటం; చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె
చిత్తం చిరుదీపం; రెపరెప రూపం తుళ్ళి పడసాగె
పసి చినుకే ఇగురు సుమా, మూగిరేగే దావాగ్ని పుడితే
మూగె నా గుండెలో నీలి మంట
శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో
తొలిపొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో
ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారె రేయల్లే
ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే
ఇది నిజమా కల నిజమా, గిల్లుకున్న జన్మనడిగా
నీ నమాజుల్లో ఓనమాలు మరిచా
సేకరణ :వేటూరి
మీ స్నేహగీతం
Comments
Post a Comment