సిరిమల్లె పువ్వల్లె నవ్వు సాంగ్, జ్యోతి తెలుగు మూవీ ,by mee snehageetham మీ స్నేహగీతం
కమర్షియల్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు గారు తీసిన ఒక చక్కని చిత్రం జ్యోతి లోని ఈ పాట చాలా బాగుంటుంది. సగంపాట నవ్వుతోనే లాగించేసినా జానకి గారు ఈ పాటతో మన మనసుపై వేసే ముద్ర మామూలుది కాదు. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరు కూడా ఆస్వాదించండి. సిరిమల్లె పువ్వల్లె నవ్వు హ్హ...హ్హ..హ్హ సిరిమల్లె పువ్వల్లె నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తు ఉండాలి నా నువ్వు.. నా నువ్వు.. హ్హ...హ్హ..హ్హ..హ్హ..హ్హ.. సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లె నవ్వూ..నవ్వూ ప ని స ...హ్హ..హ్హ...హ్హ.. స గ మ ...హ్హ...హ్హ...హ్హ... గ మ ప ...ఆ...హ్హ...హ్హ.. ని ని ప మ గ గ మ ప హ్హ ..హ్హ..హ్హ..హ్హ...ఆ..ఆ..ఆ.. ఆ..ఆ.. చిరుగాలి తరగల్లె మెలమెల్లగా... సెలయేటి నురగల్లె తెలతెల్లగా చిరుగాలి తరగల్లె మెలమెల్లగా... సెలయేటి నురగల్లె తెలతెల్లగా చిననాటి కలలల్లె తియతియ్యగా... ఎన్నెన్నో రాగాలు రవళించగా..రవళించగా ఉహూ..హ్హ..హ్హ..హ్హ.. సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లె నవ్వూ... నవ్వూ నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా... ఆ వెలుగులో నేను పయనించగా నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా... ఆ వెలుగులో నేను పయనించగా ఆ....ఆ...ఆ...ఆ... వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా ఆ....వెలుగుతూ ఉంటాను నీ దివ్వెగా నే మిగిలి ఉంటాను తొలి నవ్వుగా..తొలి నవ్వుగా సిరి మల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లె నవ్వు చిరకాలముండాలి నీ నవ్వు... చిగురిస్తు ఉండాలి నా నువ్వు... నా నువ్వు హ్హ...హ్హ...హ్హ...హ్హ...హ్హ.. సిరిమల్లె పువ్వల్లె నవ్వు.. హ్హ..హ్హ..హ్హా.. చిన్నారి పాపల్లె నవ్వూ.. హ్హ..హ్హ...హ్హ.. చిత్రం : జ్యోతి (1976) సంగీతం : చక్రవర్తి సాహిత్యం : ఆచార్య ఆత్రేయ గానం : బాలు, జానకి —
మీ స్నేహగీతం
Comments
Post a Comment