Maate Mantramu Video Song - Seethakoka Chiluka Movie మీ స్నేహగీతం ,by mee snehageetham
మాటే మంత్రము...మనసే బంధము 1981 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఇలాంటి ప్రేమకథల ట్రెండ్ అప్పట్నించే మొదలయింది. ఈ సినిమాకి దర్శకత్వం భారతీ రాజా గారు. సంభాషణలు హాస్యబ్రహ్మ జంధ్యాల గారు రాసారు. ఈ సినిమాకి అత్యద్భుతమైన సంగీతాన్ని ఇళయరాజా గారు అందించారు. ఇళయరాజా గారి ఆణిముత్యాల్లో ఈ సినిమా పాటలు ముందువరుసలో ఉంటాయి. సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి గారు చాలా అర్ధవంతంగా, మధురంగా రాసారు. ఈ పాటని SP బాలు, SP శైలజ పాడారు. ఈ పాట మొదలవగానే అందరు గుర్తు పట్టేస్తుంటారు ఎందుకంటే పాట మొదట్లో హిందూ మంత్రాలు, చర్చి సంగీతం వస్తాయి. ఈ సినిమాలో హీరో హిందువు, హీరోయిన్ క్రైస్తవురాలు. అందుకే అలా సింబాలిక్ గా పెట్టారన్నమాట. ఈ పాట వినడానికి వీనుల విందుగా ఉంటుంది. మాటలు నిజంగా మనసుకి హత్తుకునే లాగ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ పాటను గుర్తు తెచ్చుకుని విని ఆనందించండి. ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుశ్శేవేంద్రియే ప్రతిదిష్టతి..... మాటే మంత్రము... మనసే బంధము... ఈ మమతే.. ఈ సమతే.. మంగళ వాద్యము... ఇది కల్యాణం... కమనీయం... జీవితం... మాటే మంత్రము... మనసే బంధము... ఈ మమతే.. ఈ సమతే.. మంగళ వాద్యము... ఇది కల్యాణం... కమనీయం... జీవితం... ఓ..ఓ..మాటే మంత్రము... మనసే బంధము... నీవే నాలో స్పందించిన...ఈ ప్రియలయలో శ్రుతి కలిసే ప్రాణమిదే... నేనే నీవుగా... పువ్వు తావిగా... సంయోగాల సంగీతాలు విరిసే వేళలో... నేనే నీవై ప్రేమించిన...ఈ అనురాగం పలికించే పల్లవిదే... ఎదలో కోవెల ఎదుటే దేవత... వలపై వచ్చి వారమే ఇచ్చి కలిసే వేళలో... మాటే మంత్రము... మనసే బంధము...
మీ స్నేహగీతం
Comments
Post a Comment