evaru nerperamma ee kommaku by mee snehageetham, మీ స్నేహగీతం
పొద్దున్నే పూచే పూలు దేవుడి పూజలో పాలుపంచుకోవాలని ఆత్రపడుతూ సిద్ధంగా ఉన్నాయన్న సుందరమైన భావనను కలిగిస్తూ, ఇలా దైవపూజ కోసం పూలిమ్మని కొమ్మకొమ్మకూ ఎవరో (దైవం) నేర్పారన్న భావనను కలిగిస్తూ, దైవం పేరెత్తకుండా దైవ భావనను స్ఫురింపజేసి ఒక పవిత్రపు ఆలోచనను కలిగిస్తుందీ పల్లవి.. పాటలోని భావాన్ని, పదాల సౌకుమార్యాన్ని అర్థం చేసుకున్న సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారు ఈ పాటను ‘బిళహరి’ రాగంలో రూపొందించాడు. బిళహరి రాగం ఉదయరాగం. పాట, సినిమాలో, ఉదయం పూట నాయిక పూలు భగవదార్చన కోసం కోస్తూ పవిత్ర భావనతో పాడుతుంది. దాంతో బంగారానికి తావి అబ్బినట్టు.. రాగం, భావం, పదం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఫలితంగా అత్యుత్తమమైన కళాసృష్టి సంభవించింది. తరతరాలకు తరగని ఆనందగని లభించింది.
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు …..
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ …..
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
కొలువైతివా దేవి నాకోసము …..
కొలువైతివా దేవి నాకోసము
తులసీ ….. తులసీ దయాపూర్ణకలశీ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ….. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి …..
మొల్లలివి నన్నేలు నా స్వామికి
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ …..
ఏ లీల సేవింతు ఏమనుసు కీర్తింతు …..
ఏ లీల సేవింతు ఏమనుసు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం
ఒక పువ్వు పాదాల ….. ఒక దివ్వె నీ మ్రోల …..
ఒక పువ్వు పాదాల ….. ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం …..
ఇదే వందనం …..
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు …..
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ …..
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
కొలువైతివా దేవి నాకోసము …..
కొలువైతివా దేవి నాకోసము
తులసీ ….. తులసీ దయాపూర్ణకలశీ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి ….. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి …..
మొల్లలివి నన్నేలు నా స్వామికి
ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు
ఎంత తొందరలే హరి పూజకు ప్రొద్దు పొడవకముందే పూలిమ్మనీ …..
ఏ లీల సేవింతు ఏమనుసు కీర్తింతు …..
ఏ లీల సేవింతు ఏమనుసు కీర్తింతు
సీత మనసే నీకు సింహాసనం
ఒక పువ్వు పాదాల ….. ఒక దివ్వె నీ మ్రోల …..
ఒక పువ్వు పాదాల ….. ఒక దివ్వె నీ మ్రోల
ఒదిగి నీ ఎదుట ఇదే వందనం …..
ఇదే వందనం …..
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
చరణం : 1
కల కల లాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
కల కల లాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
కల కల లాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
కల కల లాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం : 2
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు ఆ...
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు ఆ...
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం... ఏమో....
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు ఆ...
రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు ఆ...
పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం... ఏమో....
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
చరణం : 3
అరుణ కిరణముల గిలిగింతలలో
కరగిన తెలిమంచు తెరలే తరలి
అరుణ కిరణముల గిలిగింతలలో
కరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
అరుణ కిరణముల గిలిగింతలలో
కరగిన తెలిమంచు తెరలే తరలి
అరుణ కిరణముల గిలిగింతలలో
కరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
సినిమా : ఈనాటి బంధం ఏనాటిదో1977
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు గారు
గానం : పి.సుశీల గారు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు గారు
గానం : పి.సుశీల గారు
మీ స్నేహగీతం
Comments
Post a Comment