Gudilo Badilo Madilo Vodilo 1Min Video Song by mee snehageetham మీ స్నేహగీతం
అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకమార సుందరం
ఆ చంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాళం
ఆనంద తీర బృందా విహార మందార సా...గరం
మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీతలపే శశి వదనా....
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవే కదా గజ గమనా .....
ఆశ గా నీకు పూజలే చేయ
ఆలకించింది ఆ నమకం
ప్రవర లో ప్రణయ మంత్రమే చూసి
పులకరించింది ఆ చమకం
అగ్రహారాల తమలపాకల్లే తాకుతుంది తమకం
మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీతలపే శశి వదనా....
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవే కదా గజ గమనా
అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
ఆ చంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాళం
ఆనంద తీర బృందా విహార మందార సా...గరం...
నవ లలనా నీ వలన కలిగె వింత చలి నా లోనా...
మిసమిసలా నిశి లోనా కసి ముద్దులిచ్చుకోనా...
ప్రియ జఘనా శుభ లఘనా... తల్లకిందులౌతూ తొలి జగడానా
ఎడతెగని ముడిపడని రస కౌగిలింతలోనా
కనులనే వేయి కలలుగా చేసి కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదలా మారి వలపు నీలి మేఘం
మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీతలపే శశి వదనా....
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవే కదా గజ గమనా
ఆ ఆ ఆ....
ప్రియరమణ శతమదనా కన్నె కాలు జారి ఇక నీతోనా
ఇరు ఎదల సరిగమనా సిగ పూలు నలిగి పోనా...
హిమనయనా సుమసయనా చిన్న వేలు పట్టి శుభతరుణానా
పనసతొన కొరికితినా పరదాలు తొలగనీనా...
పడక గదినుంచి విదుదలే లేని విడిది వేచింది మన కోసం
వయసు తొక్కిళ్ళ పడుచు ఎక్కిళ్ళ తెచ్చే మాఘ మాసం
మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీతలపే శశి వదనా....
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవే కదా గజ గమనా
అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ సుకమార సుందరం
ఆ చంద్రతార సంధ్యా సమీర నీహార హార భూపాళం
ఆనంద తీర బృందా విహార మందార సా...గరం
మీ స్నేహగీతం
టెక్స్ట్ :బాలు
Comments
Post a Comment