Geethanjali Songs - Amani Padave,ఆమని పాడవే హాయిగా, by mee snehageetham, మీ స్నేహగీతం
అద్భుత సాహిత్య సృష్టిని అతి సామాన్య గీతంతో సరితూస్తూ, సరదాగా సాగిపోయే పాటకు దీటుగా గంభీర గీతాలు వ్రాస్తూ, విషాద గీతాల సరసన ప్రణయ గీతాలు చేరుస్తూ, సినిమాలలో సాహిత్యానికి ఉన్నత స్థానం కల్పించిన మహా కవి శ్రీ వేటూరి సుందర రామమూర్తి. తన రచనలలో శ్రీ వేటూరి పలికించని భావం కానీ, రసం కానీ, మానవీయ కోణం కానీ, లేవు అంటే అతిశయోక్తి కాదు.మహాకవి వేటూరి సుందరరామమూర్తిగారికి వర్ధంతి సందర్భంగా మా కన్నీటి నివాళి..........
ఆమని పాడవే హాయిగా .. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో .. పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా .. మౌనమైన వేళలా
ఆమని పాడవే హాయిగా … ఆమని పాడవే హాయిగా
వయస్సులో వసంతమే... ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే... రచించెలే మరీచిక
పదాల నా యదా...స్వరాల సంపద
తరాల నా కథ...క్షణాలదే కదా
గతించిపోవు గాథ నేననీ
ఆమని పాడవే హాయిగా .. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో
శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివి భువీ కలా నిజం స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించిపోని గాథ నేననీ...
ఆమని పాడవే హాయిగా .. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో .. పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా .. మౌనమైన వేళలా
ఆమని పాడవే హాయిగా .. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో .. పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా .. మౌనమైన వేళలా
ఆమని పాడవే హాయిగా … ఆమని పాడవే హాయిగా
వయస్సులో వసంతమే... ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే... రచించెలే మరీచిక
పదాల నా యదా...స్వరాల సంపద
తరాల నా కథ...క్షణాలదే కదా
గతించిపోవు గాథ నేననీ
ఆమని పాడవే హాయిగా .. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో
శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివి భువీ కలా నిజం స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై
నివాళి కోరిన ఉగాది వేళలో
గతించిపోని గాథ నేననీ...
ఆమని పాడవే హాయిగా .. మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో .. పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిలా .. మౌనమైన వేళలా
ఆమని పాడవే హాయిగా … ఆమని పాడవే
మీ స్నేహగీతం
Comments
Post a Comment