Repliya Yeda pongina by mee Snehageetham మీ స్నేహగీతం
సాధారణంగా మన సంగీత కచేరిలలో చివరగా పాడే రాగం సింధుభైరవి.
సింధుభైరవి రాగాన్ని దేశీయ రాగం అంటారు. అంటే, అన్య (హిందూస్తానీ) పద్ధతికి చెందిన ఈ రాగాన్ని మన కర్ణాటక సంగీత సాంప్రదాయకులు సింధునదీ ప్రాంత భైరవిగా గుర్తించి పెట్టుకున్న పేరు “సింధుభైరవి”. హిందూస్తానీ సంగీత కచ్చేరీలలో కూడా భైరవి రాగాన్ని (హిందూస్తానీ సంగీతంలోని భైరవి రాగం మన కర్ణాటక సంగీతంలోని సింధుభైరవి కి సమానం) పాడిన తరవాత ఇంక ఏ రాగాన్ని పాడరు. ఇదే ఆఖరి రాగం. కానీ, కర్ణాటక సాంప్రదాయంలో అంత ఖచ్చితంగా ఈ పద్ధతి పాటించరు. సింధుభైరవి పాడిన తరవాత సురటి గాని మధ్యమావతి గాని పాడతారు.
వ్రేపల్లియ ఎదఝల్లున పొంగిన రవళి
నవరస మురళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి
ఇదేనా .. ఇదేనా ఆ మురళి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి
ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి .. ఇదేనా ఆ మురళి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి
ఇదేనా .. ఇదేనా ఆ మురళి
మీ స్నేహగీతం
Comments
Post a Comment