Ninnu Kori Varnam Song,by mee snehageetham మీ స్నేహగీతం
మోహన రాగంలో ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయ రాజా గారు చేసిన అనేక ప్రయోగాల్లో, మొదటిది “నిన్ను కోరి వర్ణం..” అన్న ఘర్షణ సినిమాలోని పాట. నిజానికి శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో “నిన్ను కోరి వర్ణం..” అన్న మోహనం రాగం వర్ణం ఉన్నా, ఈ సినిమా పాట కొంచెం శాస్త్రీయ సంగీతానికి కొంచెం భిన్నంగా కనపడుతుంది. కానీ, పూర్తిగా మోహన రాగం, ఆది తాళంలో స్వరపరచబడ్డ ఈ పాట వింటే, తెలిసిన మోహన రాగంలో ఎంతటి విలక్షణత తీసుకురావచ్చో ఇళయ రాజా గారు నిరూపించాడు. ఇలాంటి ప్రయోగాలు మన శాస్త్రీయ సంగీతం మీద మాత్రమే కాకుండా, వెస్టర్న్ మ్యూజిక్ మీద కూడా మంచి పట్టు ఉన్న ఇళయ రాజా గారి లాంటి వారు మాత్రమే చెయ్యగలరు.
చిత్రం : ఘర్షణ
గాత్రం: చిత్ర
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
కురికిన వాగల్లే
తోలకరి కవితల్లే
తలపులు కధిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఉడికించే చిలకమ్మ నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాల బంధాలే నీకందించే
అచ్చట్లు ముచ్చట్లు తానాసించే
మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది
కలలే విందు చేసెనే
నీతో పొందు కోరనే
ఉండాలని నీ తోడు చేరిందిలే ఈ నాడు సరసకు
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
కురికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
ఈ వీణ మీటేది నీవే నంట
నా తలపు నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వాగతం
పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం
కానిరాదే సంగమం
నీ జ్ఞాపకం నా లోనే సాగేనులే ఈ వేళ సరసకు
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
కురికిన వాగల్లే
తొలకరి కవితల్లే
తలపులు కధిలేనే
చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
నిన్ను కోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
మీ స్నేహగీతం
Comments
Post a Comment