chelimi lo valapu,Mouna Geetham song,by mee snehageetham, మీ స్నేహగీతం
మౌనగీతం సినిమాలోని “చెలిమిలో వలపు రాగం” అన్న ఈ పాట వినేఉంటారు కానీ చెవుల ద్వారా సూటిగా మన మెదడుకు చేరుకుని ఆపై మత్తును తనువంతా ప్రవహింప చేసి మనిషిని తన స్వాధీనంలోకి తెచ్చుకునే ఒక మత్తుమందుని నింపిన పాటే... పాటకి ముందు నిముషం పాటు వచ్చే మ్యూజిక్ బిట్ కానీ పపపపా అంటూ తీసే ఆలాపన కానీ పాట మూడ్ లోకి అలా తీస్కెళిపోతే పాట ముగిసేంతవరకూ ఆత్రేయ గారి సాహిత్యం, బాలు జానకిల గాత్రం ఇళయరాజా స్వరాలతో కలిసి మిమ్మల్ని మరోలోకంలో విహరింప చేస్తుంది. చిత్రం : మౌనగీతం (1981) సంగీతం : ఇళయరాజా సాహిత్యం : ఆత్రేయ గానం : బాలు, జానకి పపపపా.. పపపపాపా.. పపపపా.. పపపపాపా.. చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. రాగం భావం కలిసే ప్రణయగీతం పాడుకో.. పాప పపా పాడుతూ.. పాప పపా ఆడుకో.. పాప పపా చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. ఉయ్యాలలూగినానూ... నీ ఊహలో నెయ్యాలు నేర్చినానూ.. నీ చూపులో ఆరాధనై గుండెలో.. ఆలాపనై గొంతులో.. అలల లాగా కలల లాగా.. అలల లాగా కలల లాగా.. కదలి రాగా... చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. నులివెచ్చనైన తాపం... నీ స్నేహము ఎదగుచ్చుకున్న భావం.. నీ రూపము తుదిలేని ఆనందమూ.. తొణుకాడు సౌందర్యమూ.. శ్రుతిని చేర్చీ.. స్వరము కూర్చీ.. శ్రుతిని చేర్చీ.. స్వరము కూర్చీ.. పదము కాగా చెలిమిలో.. వలపు రాగం.. వలపులో.. మధుర భావం.. రాగం భావం కలిసే ప్రణయ గీతం పాడుకో.. పాప పపా పాడుతూ.. పాప పపా ఆడుకో.. పాప పపా పపపపా.. పపపపాపా.. పపపపా.. పపపపాపా..
https://www.youtube.com/watch?v=7yFX0MJ2Sx4
Comments
Post a Comment