Raghuvaran B-tech Song : Amma Amma by mee snehageetham ,మీ స్నేహగీతం



అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా | నువ్వే లేక వసివాడానమ్మా
మాటే లేకుండా నువ్వే మాయం | కన్నిరవుతోంది యదలో గాయం
అయ్యో వెళిపోయావే | నన్నొదిలేసి ఎటు పోయావే
అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట
నే పాడే జోలకు నువు కన్నెత్తి చూసావో అంతే చాలంట
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా | నువ్వే లేక వసివాడానమ్మా

చెరిగింది దీపం | కరిగింది రూపం | అమ్మా నాపై ఏమంత కోపం
కొండంత శోకం | నేనున్న లోకం | నన్నే చూస్తూ నవ్వింది శూన్యం
నాకే ఎందుకు శాపం | జన్మల గతమే చేసిన పాపం
పగలే దిగులైన నడిరేయి ముసిరింది | కలవర పెడుతోంది పెను చీకటి
ఊపిరి నన్నొదిలి నీలా వెళిపోయింది | బ్రతికి సుఖమేమిటి
ఓ అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా | నువ్వే లేక వసివాడానమ్మా

విడలేక నిన్ను | విడిపోయి వున్నా | కలిసే లేనా నీ శ్వాసలోన
మరణాన్ని మరచి | జీవించి వున్నా | ఏ చోట వున్నా నీ ధ్యాసలోన
నిజమై నే లేకున్నా | కన్నా నిన్నే కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగే నడిచేనా | కలతను రానీకు కన్నంచున
కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన | చిగురై నిను చేరనా

అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా | నువ్వే లేక వసివాడానమ్మా
అడుగై నీతోనే నడిచొస్తున్నా | అద్దంలో నువ్వై కనిపిస్తున్నా
అయ్యో వెళిపోయావే | నీలో ప్రాణం నా చిరునవ్వే
అమ్మా ఇకపై నే వినగాలనా నీ లాలిపాట
వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా
మీ స్నేహగీతం 

Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham