Challenge Songs - Induvadana మీ స్నేహగీతం by mee snehageetham
సాధారణంగా కవులు తమ కవిత్వంలో రకరకాల అలంకారాలు విరివిగా వాడుతుంటారు. కానీ ప్రతీ కవికి కొన్ని అలంకారాలంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలంకారాలు రెండు రకాలుగా విభజించ బడ్డాయి - శబ్దాలంకారం మరియు అర్దాలంకారం. శబ్దాలంకారం అంటే శబ్దానికి ప్రాధాన్యత నిచ్చే అలంకారం. ఈ అలంకారం కూర్చటంలో కవికి భావనా బలం కన్న అక్షరాల కూర్పులో నైపుణ్యం కావాలి. ప్రయోగించిన అక్షరాలనే మరల మరల ప్రయోగిస్తూనో, రెండేసి మూడేసి అక్షరాలున్న పదాలను జంటలుగా స్వీకరించో, అర్ధ భేదాన్ని ఆశిస్తూనో , తాత్పర్య భేదాన్ని కోరుకుంటూనో ఈ శబ్దాలంకార ప్రక్రియ సాగుతోంది. ఇది ఒక క్రీడ లాంటిది. ఈ క్రీడలో మనసుకు హత్తుకునేలా అక్షరాల కూర్పు చేసుకోగల కవి మెరుస్తాడు. ఇలాంటి ఒకటి రెండు శబ్దాలంకారాల గురించి ప్రస్తావించు కుంటూ వేటూరి గారి పాటలను ఉదాహరణంగా తీసుకుందాము. వృత్యనుప్రాసాలంకారం అనగా ఒకే హల్లు అనేక సార్లు మరల మరల ప్రయోగించటం. "ఇందు వదన కుంద రదన మంద గమన మధురవచన ..." అనే పాటలో బిందుపూర్వక దకారం పలు మారులు ప్రయోగించబడినది. "జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓమైనా ఓమైనా" అనే పాటలో లకారం మరల మరల ప్రయోగించబడినది.
పల్లవి :
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపె తెలిపె చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగె వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జో హారిక
ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జో హారిక
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో
పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో
కసి కసి చూపులతో కొసకొస మెరుపులతో నన్నల్లుకో
ముకుళించే పెదవుల్లో మురిపాలు
ఋతువుల్లో మధువంతా సగపాలు
సాహోరే భామా హోయ్
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపె తెలిపె చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగె వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జో హారిక
ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జో హారిక
మీసంలో మిసమిసలు మోసాలే చేస్తుంటే
బిగిసిన కౌగిలిలో సొగసరి మీగడలే దోచేసుకో
రుస రుస వయసులతో ఎడదల దరువులతో ముద్దాడుకో
తొలిపద్దు ఎండల్లో సరసాలు
పగపట్టే పరువంలో ప్రణయాలు జోహారే ప్రేమ హోయ్
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
తొలివలపె తెలిపె చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగె వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జో హారిక
ఐ లవ్ యూ ఓ హారికా నీ ప్రేమకే జో హారిక
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే
మీ స్నేహగీతం
Comments
Post a Comment