Yenno Yenno : Malli Malli Idi Rani Roju,by mee snehageetham ,మీ స్నేహగీతం
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే
చెలి కళ్ళై మెరిసేలే
మబ్బులోని జాబిల్లె నా చెలి
నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగా
మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు
నాకు నీవే నీవే..
వేవేల ముందూ జన్మల
బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి
బంజర్లోను పూచేటి పూలన్నీ
నీ హోయలె..
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే
చెలి కళ్ళై మెరిసేలే
మబ్బులోని జబిల్లె నా చెలి
నగుమోమై విరిసెలే
నీ కోసమే ఎదనే గుడిలో
ఇలా మలిచే నా మనసే
నీ కానుకై నిలిచే తనువే
నవరసమే నీవంత
పరవశమై జన్మంతా
పరిచయమే పండాలంట
ప్రేమే ఇంకా ఇంకా..
మరి మరి నీ కవ్వింత
విరియగా నా వొళ్ళంతా
కలిగేనుల ఓ పులకింత
ఎంతో వింత..
నువ్వువిన జగమున నిలుతున ప్రియతమ
వేవేల ముందు జన్మల
బంధాలన్నీ నీవేలే
యెదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి
బంజర్లోను పూచేటి పూలన్నీ
నీ హోయలె..
ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే
చెలి కళ్ళై మెరిసేలే
మబ్బులోని జాబిల్లె నా చెలి
నగుమోమై విరిసెలే
గుండెలు ప్రాణంగా నీవే నిండంగ
మండే ఎండల్లో వేసే చలి చలి
ప్రేమ రాగాలు ప్రళయ కలహాలు
నాకు నీవే నీవే
వేవేల ముందు జన్మల
బంధాలన్నీ నీవేలే
ఎదలో సందళ్ళు నీ అందాలేలే
సంద్రాల నీరే ఇంకేటి
బంజర్లోను పూచేటి పూలన్నీ
నీ హోయలె..
మీ స్నేహగీతం
Comments
Post a Comment