Uppongele Godavari Song - Godavari Movie mee snehageetham మీ స్నేహగీతం
పేరులోనే ఉంది గోదావరి. ఇక పాటల సంగతి ఏమని చెప్పాలి.. గోదారినంటిపెట్టుకున్న వేటూరి గారి సాహిత్యం. “గోదావరి” (2006) చిత్రం కోసం వేటూరి గారు రాయగా బాలు గారు పాడిన పాట “ఉప్పొంగెలే గోదావరి.. ఊగిందిలే చేలో వరి. భూదారిలో నీలాంబరి, మా సీమకే చేలాంబరి” నిజంగా ఇష్టంలేని వారెవరైనా ఉంటారా..?
చిత్రం: గోదావరి (2006)
రచన: వేటూరి
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
చిత్రం: గోదావరి (2006)
రచన: వేటూరి
సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
సాకీ:
షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతిశిఖరే నిగమఝరే స్వరలహరే
సాసపాపపప పమరిససనిస
సాసపాపపప పమదపప
సాసపాపపప పమరిససనిస
సాసపాపపప పమనిదప
పల్లవి:
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప దోసెయ్ నావ బార్ సెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా ||ఉప్పొంగెలే||
చరణం 1:
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాగా ||ఉప్పొంగెలే||
చరణం 2:
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బేపట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా ||ఉప్పొంగెలే||
షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతిశిఖరే నిగమఝరే స్వరలహరే
సాసపాపపప పమరిససనిస
సాసపాపపప పమదపప
సాసపాపపప పమరిససనిస
సాసపాపపప పమనిదప
పల్లవి:
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
వేసెయ్ చాప దోసెయ్ నావ బార్ సెయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా ||ఉప్పొంగెలే||
చరణం 1:
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇళ్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాగా ||ఉప్పొంగెలే||
చరణం 2:
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బేపట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా ||ఉప్పొంగెలే||
మీ స్నేహగీతం
Comments
Post a Comment