Love Failure Inthajare Inthajare song by mee snehageetham
పాతికేళ్లు వ్యర్ధమేనా పేరుకైనా విలువలేదా
ఈ పిల్లచెలిమిలో ఈ ఒక్క క్షణముకే
సలాము కొట్టలా వయసు వట్టిపోయెనా
వెనకడుగే ముందుచూపా నీ వైపే
పిల్లా వెల్లువెత్తే నా అడుగులే
నీలా మారిపోయే నా నడకలే
ఏ నీడ లేని దేహం ఏంటో నీకు నాకు మధ్య అద్దంఅడ్డు ఉన్నా వీడిపోదేమిటో
ఇంతజారే ఇంతజారే ఇంతలోపే ఎంత జోరే
బిందువల్లె ఉన్ననన్నే జల్లు లాగ మార్చినావే
ఇంతజారే ఇంతజారే వింత మైకం చెంత చేరే
నిన్ను కలిసే వేలకోసం వెల్లివిరిసే ఈ హుషారే
చిన్ని చిన్ని కవితలున్న పుస్తకంలా
నీ జ్ఞాపకాలే నిండి ఉన్న మనసు నేడిలా
హై కూలుతోటి కోవిలమ్మ కుహుకుహూలు నింపుతోందిలా
నా నీ లు రాసి వయసు వాడ్ని బాణికట్టి పాడుతుందిలా
ఈ పదీ రోజులే నీ పదీ ఆకలే
నిన్నిలా పదే పదే జ్ఞాపకం చేస్తుంటే
ఇంతజారే ఇంతజారే కాలి కింది నేల జారే
తుళ్ళిపోయే ఉల్లి లాగా నువ్వు లేక నేనెలాగ
ఇంతజారే ఇంతజారే ఇంత లోపే ఎంత మారే
గుండె పిండే తేనె పట్టే చేదు నిండా తీపి పుట్టే
నిన్న మొన్న కాలమంత ఏమయిందో
రేపు అన్న భావమంత మాయమైందో
నీ ఊహలోనే కాలమంత మైనమల్లె కరుగుతోందో
నీ రూపు తప్ప కంటిపాపా నన్ను కూడా చూడనందో
ఆశలే లేవులే ఆకలే ఉండదే అలసటే రాదులే నిన్నిలా... చూస్తుంటే....
ఇంతజారే ఇంతజారే తలపులన్నీ తారుమారే
సొంత స్త్రీటులో నాకు నేనే పరదేశిలా ఐపోయానే
ఇంతజారే ఇంతజారే వో వో వో వో ...............
ఇంతజారే ఇంతజారే వరస మొత్తం మారిపోయే
కళ్ళు తెరిచే నిద్రపోయా నిన్ను మరవడం మర్చిపోయా.......
Comments
Post a Comment