navami naati vennela nenu by mee snehageetham మీ స్నేహగీతం
నవమి నాటి వెన్నెల నేను... ..
రమేష్ నాయుడు గారి మరో ఆణిముత్యం ఈ పాట.ముఖ్యంగా మధురమైన ఆ బాణి వింటూంటే ఎంత హాయిగా ఉంటుందో మాటలలో చెప్పడం కష్టం. ఇక వేటూరి గారి నవమి దశమి పద ప్రయోగం గురించి కూడా చాలా చర్చలు జరిగాయి ఆన్ లైన్ ఫోరమ్స్ లో. కొందరు "ఇద్దరూ గొప్పే... కానీ అసంపూర్ణం.. ఆఇద్దరూ కలిస్తేనే పున్నమి..." అనే స్ట్రెయిట్ అర్ధమే ఉంది అంటే, ఇంకొందరు "జయసుధ హీరో కన్నా వయసులో పెద్ద కనుక, ఆమెను ముందు పుట్టిన నవమి నాటి వెన్నెలతో పోల్చి వేటూరి వారు చమత్కరించారు" అని అన్నారు. వాస్తవమేమిటో వేటూరి వారికే తెలియాలి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
దశమి నాటి జాబిలి నీవు
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గా
నీ నగవే సిగ మల్లిక గా
చెరిసగమై యే సగమేదో
మరచిన మన తొలి కలయికలో
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గా
నీ నగవే సిగ మల్లిక గా
చెరిసగమై యే సగమేదో
మరచిన మన తొలి కలయికలో
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
దశమి నాటి జాబిలి నీవు
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతి గా
అందించే నా పార్వతి గా
మనమొకటై రసజగమేలే
సరస మధుర సంగమ గీతికలో
నీ గుడిలో వెలుగే నేనై
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతి గా
అందించే నా పార్వతి గా
మనమొకటై రసజగమేలే
సరస మధుర సంగమ గీతికలో
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి
నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
దశమి నాటి జాబిలి నీవు
మీ స్నేహగీతం
Comments
Post a Comment