Gudilo Badilo Madilo Vodilo Full Song With Lyrics


చాలా రోజుల తరువాత, ఒక స్వచ్చమైన తెలుగు పాట విన్నాను అనిపించింది! అదే ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రంలోని ‘గుడిలో బడిలో’ అనే ఈ యుగళగీతం!
ఈ పాటలో కొన్ని మనకి తెలియని పదాలు కూడా ఉన్నాయి, ‘సాహితి’ గారు రాసిన ఈ పాట భావాన్ని నాకు అర్థమైనంత వరకూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను…
పల్లవి:
కథానాయిక:
అస్మైక యోగ, తస్మైక భోగ, రస్మైక రాగ హిందోళం…
నాది ఒక యోగం, నీది ఒక భోగం! మనిద్దరం కలిస్తే అది ఒక రసమయమైన హిందోళరాగం!
అంగాంగ తేజ, శృంగార భావ, సుకుమార సుందరం…
దేహం అంతా తేజస్సు, మనసున అంతా శృంగార భావం, నీ అందం కోమలం!
ఆచంద్రతార, సంధ్యాసమీర, నీహారహార భూపాళం…
భూపాళరాగం ఉదయం ఆలయాలు తెరిచే వేళలో ఉపయోగిస్తారు…
ఆ సమయంలో ఉండే చంద్రుడు తారలు, అలాంటి సంధ్య సమయంలో వీచే గాలి…
నీహారం అంటే మంచు! సూర్యుడు రాక ముందు మంచు ఒక హారంలా ఉంటుంది భూమిపై…
ఆనందతీర, బృందావిహార, మందారసాగరం…(మందర సాగరం)
తీర అంటే పూర్తిగా! పూర్తి ఆనందం… బృందావనంలో చేసే విహారం… మందర పర్వతంతో చేసిన క్షీరసాగరమధనం…
నీతో ఉన్న సమయం! వీటి వల్ల కలిగిన అనుభూతిలా ఉంటుంది!
(పాటలో ‘మందార సాగరం’ అని ఉంది, కానీ ఎందుకో అది ‘మందర సాగరం’ అనిపించి ఇలా చెప్పాను!)
కథానాయకుడు:
మడిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశివదనా...
ఎక్కడ ఉన్నా కూడా నీ ఆలోచనే! (శశివదన = చంద్రుని వంటి ముఖము గలది)
గదిలో మదిలో యదలో సొదలో
నీవె కదా గజగమనా… || 2 ||
ఎక్కడ చూసినా నీవే ఉన్నావు! (గజగమనా = ఏనుగు వంటి నడక గలది)
ఆశగా నీకు పూజలే చేయ, ఆలకించింది ఆ నమకం…
ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి, పులకరించింది ఆ చమకం…
అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం… || మడిలో|| ||అస్మైక యోగ||
నీకోసం పూజ చేస్తుంటే, ఆ నమకం వింటోంది!
ప్రవర చెప్తునప్పుడు నువ్వు గుర్తుకొచ్చి నేను చెప్పిన ప్రేమ మంత్రానికి ఆ చమకం సైతం పులకరించింది!
నీ మీద మోహం అగ్రహారంలో ఉండే తమలపాకులా తాకుతోంది!
[ప్రత్యేకించి అగ్రహారంలో ఉండేవాళ్ళకి కానీ, అక్కడ నుంచి వచ్చిన వాళ్లకి కానీ, భోజనం ఎంత తప్పనిసరో తాంబూలం కూడా అంతే తప్పనిసరి! అందువల్ల అక్కడి వాళ్లకి తమలపాకులు అంత ఇష్టం! అంతే కాదు తమలపాకు పూజలలో వాడుతారు! చాలా పవిత్రంగా భావిస్తారు… కథానాయకుడు ఆగ్రహారానికి సంబంధించిన వాడు కాబట్టి ఈ పోలిక వాడారు]
పల్లవి వరకు కఠినమైన పదాలు వాడిన ‘సాహితి’ గారు, చరణాలకి వచ్చేసరికి అందరికి అర్థం అయ్యేలాగే రాశారు!
చరణం – 1:
నవలలనా నీవలన, కలిగె ఎంతొ వింత చలి నాలోన…
మిసమిసల నిశిలోనా, కసి ముద్దులిచ్చుకోనా…
ప్రియ జఘన శుభ లగన, తల్లకిందలౌతు తొలి జగడాన…
ఎడతెగని ముడిపడని, రస కౌగిలింతలోనా…
కనులనే వేయి కలలుగా చేసి, కలిసిపోదాము కలకాలం
వానలా వచ్చి వరదలా మారె, వలపు నీలిమేఘం || మడిలో||
చరణం – 2:
ప్రియ రమణ శత మదన, కన్నె కాలుజారి ఇక నీతోనా…
ఇరు యదల సరిగమన, సిగ పూలు నలిగిపోనా…
హిమ నయన సుమ శయన, చిన్నవేలు పట్టి శుభతరుణానా…
పనసతొన కొరికితినా, పరదాలు తొలగనీనా…
పడకగది నుంచి విడుదలే లేని, విడిది వేచింది మనకోసం
వయసు తొక్కిల్ల పడుచు ఎక్కిళ్ళు, తెచ్చె మాఘమాసం… || మడిలో|| ||అస్మైక యోగ||
ఇది విన్నాక, తెలుగు ఎంత బాగుందో అనిపించింది కదా! అదే మన తెలుగు…
తెలుసుకోవాలే గాని తెలుగుకి మించిన లోతు లేదు…
ఆస్వాదించాలే కానీ తెలుగుకి మించిన రసం లేదు…
ప్రేమించాలే కానీ తెలుగుకి మించిన ప్రేయసి లేదు…
సోర్స్:Santosh Sarma గారు
చాయ్ బిస్కెట్
ఇక్బాల్ గారి పోస్ట్ నుండి సేకరణ 


Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham