Aalochana Vasthene Song from o my friend by mee snehageetham
ఆలోచన వస్తేనే అమ్మో అనిపిస్తోందే నువ్వంటూ నాక్కనబడకుంటే ఏమయ్యేదో
నిన్నటి దాక నేనే నువ్వు నా పక్కన లేన్దే ఉన్నానంటే నమ్మాలో లేదో..
ఏనాడైనా ఈమాట నీతో అనగలనో లేదో
హో అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం ఇద్దరికీ తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం
హో ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం
ప్రాయం ఉన్నా, పయనం ఉన్నా పాదం మాత్రం ఎటో పడదు
దారీ నేనై, దరినీ నేనై, నడిపిస్తాగా ప్రతీ అడుగు
బెదురుగా హా.. తడబడే మనసిదీ
కుదురుగా హా.. నిలపవా జతపడి
|| హో అంటున్నది ||
నీ కన్నులతో చూసేదాకా, స్వప్నాలంటే తెలీవెపుడూ
నా కల ఏదో గుర్తించగా నీ రూపంలో ఇలా ఇపుడూ
చలనమే హా.. కలగని చెలియలో.. హా...
సమయమే హా.. కరగని చెలిమిలో
|| ఆలోచన వస్తేనే ||
Comments
Post a Comment