Nee Navvu Cheppindi Video Song by mee snehageetham, మీ స్నేహగీతం



నీ నవ్వు చెప్పింది నాతో - నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో - ఇన్నాళ్ళ లోటేమిటో
ఓ ఓ ల ల లా లా - ఓ ఓ ల ల లా లా...
నీ నవ్వు చెప్పింది నాతో - నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో - ఇన్నాళ్ళ లోటేమిటో 

నాకై చాచిన నీ చేతిలో - చదివాను నా నిన్ననీ 
నాకై చాచిన నీ చేతిలో - చదివాను నా నిన్ననీ 
నాతో సాగిన నీ అడుగులో - చూసాను మన రేపునీ
పంచేందుకే ఒకరు లేని - బతుకెంత బరువో అనీ
ఏ తోడుకి నోచుకోని - నడకెంతో అలుపో అనీ 


నల్లని నీ కనుపాపలలో - ఉదయాలు కనిపించనీ 
నల్లని నీ కనుపాపలలో - ఉదయాలు కనిపించనీ 
వెన్నెల పేరే వినిపించనీ - నడిరేయి కరిగించనీ
నా పెదవిలో నువ్వు ఇలాగే చిరునవ్వు పుడుతుందనీ
నీ సిగ్గు నా జీవితాన  తొలి ముగ్గు పెడుతుందనీ


ఏనాడైతే ఈ జీవితం - రెట్టింపు బరువెక్కునో
ఏనాడైతే ఈ జీవితం - రెట్టింపు బరువెక్కునో
తనువూ మనసూ చెరి సగమని - పంచాలి అనిపించునో
సరిగా అదే శుభముహూర్తం - సంపూర్ణ మైయ్యేందుకు
మనమే మరో కొత్త జన్మం - పొందేటి బంధాలతో
ఓ ఓ ల ల లా లా... ఆ ఆ  ల ల లా లా

నీ నవ్వు చెప్పింది నాతో - నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో - ఇన్నాళ్ళ లోటేమిటో
మీ స్నేహగీతం 

Comments

Popular posts from this blog

Sowbhagya lakshmi ravama ( సౌభాగ్య లక్ష్మి రావమ్మా ) by mee snehageetham

Anna Chelleli Anubandham from Gorintaku by mee snehageetham

Sri Suryanarayana Meluko Video Song from Mangammagari Manavadu మీ స్నేహగీతం

Priya Ninu Chudalekaa- Prema Lekha Telugu Movie Songs-by mee snehageetham

Ide Naa Modati prema lekha ( ఇదే నా మొదటి ప్రేమ లేఖ ) from Swapna 1980 మీ స్నేహగీతం

Palike Mounama Song పలికే మౌనమా మౌనమే వేదమా ,మీ స్నేహగీతం

Sri Ranga Ranga nathuni song - Mahanadi -by mee snehageetham

Manmadhude Video Song Naa Autograph మీ స్నేహగీతం

Apple Pilla Neevevaro - Roja Poolu - by mee snehageetham

Snehamena jeevitam snehamera saswatam by mee snehageetham