Ananda Bhairavi Songs | Pilichina Muraliki Song by mee snehageetham
పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగం మురసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం మది ఆనంద భైరవి రాగం కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే.. కులికే మువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే.. మనసే మురళీ ఆలాపనలో మధురానగరిగ తోచే... యమునా నదిలా పొంగినదీ స్వరమే వరమై సంగమమై మురసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం మది ఆనంద భైరవి రాగం పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగం !! ఎవరీ గోపిక పదలయ వింటే ఎదలో అందియ మ్రోగే..... పదమే పదమై మదిలో వుంటే ప్రణయాలాపన సాగే... హౄదయం లయమై పోయినదీ లయలే ప్రియమై జీవితమై మురసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమపరాగం మది ఆనంద భైరవి రాగం పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఎదలో ఒకటే రాగం అది ఆనందబైరవి రాగం !!
మీ స్నేహగీతం
Comments
Post a Comment