Kalise Prathi Video Song from aalapana by mee snehageetham మీ స్నేహగీతం
నారాయణరెడ్డి గారి ఆణిముత్యాలలో ఇదొకటి, ఎంత బాగా రాసారండి రెడ్డి గారు. మొదటి చరణంలో "పొంగి పోదా సాగరాత్మ నింగికి" ఈ ప్రయోగం ఎవ్వరు చెయ్యలేరు చెయ్యరు కూడా.
వంశీ, రాజా ల కాంబినేషన్ లో వచ్చిన అణిముత్యాలలొ ఇది ఒకటి, బాలు, జానకమ్మా భలే పాడారు,
ఇళయరాజా గారి ఈ పాటలో పల్లవి చరణాల మద్య ఇంటర్ ల్యూడ్ లో మృదంగం, వేణువు, వీణల కాంబినేషన్ చాలా బాగుంటుది.
కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో
కలిసే ప్రతి సంధ్యలో.. కలిగే పులకింతలో
నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి
నాట్యాలన్నీ కరగాలి... నీలో నేనే మిగలాలి
కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో..
పొంగిపోదా సాగరాత్మ నింగికి
చేరుకోదా చంద్ర హృదయం నీటికి
సృష్టిలోన ఉంది ఈ బంధమే
అల్లుకుంది అంతటా అందమే
తొణికే బిడియం తొలగాలి
వణికే అధరం పిలవాలి
ఆ..ఆ...ఆ...
కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో
మేనితోనే ఆగుతాయి ముద్రలు
గుండె దాకా సాగుతాయి ముద్దులు
వింత తీపి కొంతగా పంచుకో
వెన్నెలంత కళ్ళలో నింపుకో
బ్రతుకే జతగా పారాలి... పరువం తీరం చేరాలి
ఆ...ఆ...ఆ...ఆ
కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో
కలిసే ప్రతి సంధ్యలో... పలికే ప్రతి అందెలో
నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి
నాట్యాలెన్నో ఎదగాలి.. నాలో నేనై మిగలాలి
కలిసే ప్రతి సంధ్యలో... కలిగే పులకింతలో..
చిత్రం: ఆలాపన (1986)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, జానకి
మీ స్నేహగీతం
Comments
Post a Comment