Daana Veera Soora Karna || Chithram Bhalaare by mee snehageetham మీ స్నేహగీతం
దానవీరశూరకర్ణ:భళారే విచిత్రం అయ్యారే విచిత్రం:ప్రతినాయకుడి పాత్రకి డ్యూయట్ సాంగ్
ఈ సినిమా పేరుకి, కర్ణుడి గురించి అయినా ధుర్యోధనుడి పాత్రను మలిచిన తీరు అద్భుతం. ఎందుకంటే అంతవరకు ఏ తెలుగు సినిమాలోని ప్రతినాయకుడి పరిచయానికి పాట లేదు. ఈ సినిమాలో ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.అలాగే ముఖ్యంగా ఈ పాట గురించి చెప్పాలంటే, ప్రతినాయకుడి పాత్రకి డ్యూయట్ సాంగ్ పెట్టాలనే అలోచనే ఒక అద్భుతం . ధీరోదాత్తుడు, మాన ధనుడయిన ధుర్యోధనునికి ఒక యుగళ గీతం పెట్టడమనేది ఒక సాహసమైన ప్రయోగము. ఎవరెన్ని సందేహాలను వెలిబుచ్చినా...... శ్రీ ఎన్.టి.రామారావు గారు వాటినన్నిటిని ప్రక్కన బెట్టి స్వీయ దర్శకత్వంలో ఆ పాటను చిత్రీకరించి అందరి మన్ననలు పొందగలిగారు . ఆ సన్నివేశానికి అనుగుణంగా శ్రీ సి.నారాయణ రెడ్డి పాటను అత్యద్భుతంగా వ్రాసి శబాష్ అనిపించుకున్నారు

చిత్రం.. ఆయ్... భళారే విచిత్రం
చిత్రం...అయ్యారే విచిత్రం
ఈ రాచనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం..
పిలువకనే ప్రియవిభుడే విచ్చేయుటే విచిత్రం..
చిత్రం అయ్యారే విచిత్రం..
చిత్రం.. ఆయ్... భళారే విచిత్రం...
రాచరికపు జిత్తులతో.. రణతంత్రపుటెత్తులతో..ఓ ఓ ఒ హొ హొ..
రాచరికపు జిత్తులతో.. రణతంత్రపుటెత్తులతో
సతమతమౌ మా మదిలో..మదనుడు సందడి సేయుటే
చిత్రం.. ఆయ్... భళారే విచిత్రం
ఎంతటి మహరాజైనా..ఆ ఆ ఆ..
ఎంతటి మహరాజైనా ఎపుడో ఏకాంతంలో..
ఎంతో కొంత తన కాంతను స్మరించుటే సృష్టిలోని చిత్రం!
ఆయ్... భళారే విచిత్రం.
అయ్యారే విచిత్రం..
బింబాధరా మధురిమలు ..బిగికౌగిలి ఘుమఘుమలు..ఆ ఆ ఆ..
బింబాధరా మధురిమలు ..బిగికౌగిలి ఘుమఘుమలు..ఆ ఆ ఆ..
ఇన్నాళ్ళుగ మాయురే..మేమెరుగక పోవుటే ..చిత్రం
ఆ హ ఆ ఆ...
వలపెరుగనివాడననీ...
వలపెరుగనివాడననీ.. పలికిన ఈ రసికమణి..
తొలిసారే ఇన్ని కళలు కురిపించుట..
అవ్వ..నమ్మలేని చిత్రం..
అయ్యారే విచిత్రం..
ఆయ్... భళారే విచిత్రం.
అయ్యారే విచిత్రం
అయ్యారే విచిత్రం
అయ్యారే విచిత్రం
మీ స్నేహగీతం
Comments
Post a Comment