Sirimalle Neeve - Pantulamma - By Mee Snehageetham
తెలుగు పాటల్లో మోహన రాగం వినిపించినంత విస్తృతంగా మరో రాగం వినపడదేమో! దీనికి ముఖ్య కారణం ఈ రాగంలో వినిపించే (వినిపించగలిగే) రకరకాలైన అనుభూతులు. స్వర పరంగా మోహన రాగం ఐదు స్వరాల (స, రి, గ, ప, ద) రాగమైనప్పటికీ, మోహనం ఇవ్వగలిగే abstractness వల్ల, సంగీతపరంగా చూపే లోతులలో ఉన్న వైవిధ్యాల వల్ల, శాస్త్రీయ సంగీతంలో ఈ రాగానికి ఒక విశిష్ట స్థానముంది. మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని మోహనం రాగానికి “దగ్గరగా” ఉండే రాగం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలో “భూప్”. స్వర పరంగా ఈ రెండు రాగాలు ఒకటే అయినప్పటికీ, శాస్త్రీయ సంగీతంలో పరిచయంఉన్న వారు ఈ రెంటినీ రెండు విభిన్న రాగాలుగా పేర్కొంటారు
చిత్రం : పంతులమ్మ(1977)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
చిత్రం : పంతులమ్మ(1977)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే
||సిరిమల్లె నీవే ||
ఎలదేటి పాటా చెలరేగె నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే.. వనదేవతల్లే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
చెలరేగిపోవే మధుమాసమల్లె
ఎలమావి తోటా పలికింది నాలో
పలికించుకోవే మది కోయిలల్లే
నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలిపూత నవ్వే.. వనదేవతల్లే
పున్నాగపూలే.. సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
||సిరిమల్లె నీవే ||
మరుమల్లె తోటా మారాకు వేసే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
మారాకువేసే నీ రాకతోనే
నీపలుకు పాటై బ్రతుకైనవేళా
బ్రతికించుకోవే నీ పదముగానే
నా పదము నీవే నా బ్రతుకు నీవే
అనురాగమల్లే.. సుమగీతమల్లే
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
నన్నల్లుకోవే.. నాఇల్లు నీవే
ఎన్నెల్లు తేవే.. ఎదమీటి పోవే
మీ స్నేహ గీతం
Comments
Post a Comment