Buddhimanthudu Songs - Thotaloki Rakura - By Mee Snehageetham
“కళావతి” రాగం హిందూస్తానీ సాంప్రదాయానికి సంబంధించింది. కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో “కళావతి” అన్న రాగం ఉన్నా, ఈ రెంటికీ పోలికలు లేవు. “చక్రవాకం” యొక్క జన్య రాగం అయిన “వలజి” అన్న రాగం హిందూస్తానీ సంగీతంలోని “కళావతి”ని కొంతవరకు పోలి ఉంటుంది. ఈ రెంటికీ స్వరస్థానాలు ఒకటే. అయితే, ఈ రెండు రాగాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని చెప్పలేము. “కళావతి” రాగాన్ని అర్ధరాత్రికి ముందు సమయంలో పాడతారు.
తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా...
చిత్రం : బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : సుశీల
తోటలోకి రాకురా.. తుంటరి తుమ్మెదా... గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ
మా మల్లి మనసెంతో తెల్లనిది అది ఏ వన్నెలేచిన్నెలెరుగనిది
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ
కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
కన్ను సైగ చేయకురా కామినీ చోరా.. గోపికాజారా..
మా రాధ అనురాగం మారనిది..
అది ఏ రాసకేళిలోన చేరనిది ..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ
మా రాధ అనురాగం మారనిది..
అది ఏ రాసకేళిలోన చేరనిది ..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ
జిలుగు పైట లాగకురా...
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది
అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
జిలుగు పైట లాగకురా..
తొలకరి తెమ్మెరా.. చిలిపి తెమ్మెరా... ..
కన్నెసిగ్గు మేలిముసుగు వీడనిది
అది ఇన్నాళ్ళు ఎండకన్నెరుగనిది
తోటలోకి రాకురా ..ఆ..ఆ..ఆ
రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
కన్నెవలపు సన్నజాజి వాడనిది..
అది ఎన్ని జన్మలైనా వసివాడనిది..
రోజు దాటి పోగానే.. జాజులు వాడునురా
మోజులు వీడునురా...
కన్నెవలపు సన్నజాజి వాడనిది..
అది ఎన్ని జన్మలైనా వసివాడనిది..
తోటలోకి రాకురా... తుంటరి తుమ్మెదా ...గడసరి తుమ్మెదా
మా మల్లి మనసెంతో తెల్లనిది.. అది ఏ వన్నె ఏ చిన్నెలెరుగనిది..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ
మా మల్లి మనసెంతో తెల్లనిది.. అది ఏ వన్నె ఏ చిన్నెలెరుగనిది..
తోటలోకి రాకురా..ఆ..ఆ.ఆ
మీ స్నేహ గీతం
Comments
Post a Comment